కిడ్నీ స్టోన్స్: తగ్గాలంటే ఈ టేస్టీ జ్యూస్ తాగండి?

Purushottham Vinay
కిడ్నీ స్టోన్స్ సమస్య ఎంత పెద్ద సమస్యో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రమాదకరమైన సమస్యల్లో ఇది కూడా ఒకటి. ఇది కేవలం పెద్దలనే కాదు పిల్లలను సైతం వేధించే సర్వసాధారణమైన ఆరోగ్య సమస్య ఇది. ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, శరీరానికి సరిపడా నీటిని అందించకపోవడం, ఊబకాయం, యూరినరీ ట్రాక్ట్ అంటువ్యాధులకు గురికావడం వంటి రకరకాల కారణాల వల్ల మూత్రపిండాల్లో స్ఫటికాకార రాళ్లు ఏర్పడతాయి.అయితే కొందరికి వంశపారంపర్యంగా కూడా కిడ్నీలో రాళ్లు వస్తుంటాయి. ఈ రాళ్లు చిన్న పరిమాణంలో ఉంటే మూత్రం ద్వారా అవి బయటకు వెళ్లిపోతాయి.కానీ, పెద్దగా ఉంటే మాత్రం మూత్రవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, తరచూ జ్వరం రావడం, అధిక చలి, నడుము నొప్పి, తరచుగా మూత్రవిసర్జన చేయాలని అనిపించడం, మూత్రంలో రక్తస్రావం వంటి రకరకాల సమస్యలు ఎదురవుతాయి. అందుకే కిడ్నీలో రాళ్లను కరిగించుకునేందుకు మందులు వాడతారు, ట్రీట్‌మెంట్స్ కూడా చేయించుకుంటారు.


అయితే మీరు కూడా ఈ సమస్యతో బాధ పడుతూ ఉన్నారా? అయితే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే జ్యూస్‌ను మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇంతకీ ఆ జ్యూస్ మరేంటో కాదు బనానా స్టెమ్(అరటి దూట) జ్యూస్‌. ఈ జ్యూస్ మూత్రపిండాల్లోని రాళ్లను చాలా వేగంగా కరిగిస్తుంది. పైగా ఈ జ్యూస్‌ను తయారు చేసుకోవడం కూడా పెద్ద కష్టమైన పనేమి కాదు.చిన్న అరటి దూటను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అరటి దూట ముక్కలను మిక్సీ జార్ లో వేసుకోవాలి. అలాగే ఒక గ్లాస్ వాటర్, కొద్దిగా రాక్ సాల్ట్ కూడా మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి జ్యూస్‌ను సపరేట్ చేసుకుని తాగేయడమే. రోజుకు ఒక గ్లాస్ ఈ బనానా స్టెమ్ జ్యూస్ ను తీసుకుంటే కిడ్నీలో రాళ్లు క్రమంగా కరిగిపోతాయి.కాబట్టి ఖచ్చితంగా ఈ జ్యూస్ తాగండి. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా జీవించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: