పాలు తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

Divya
గతంలో ప్రతి ఒక్కరి ఇంట్లో పాడి పశువులు ఉండేవి అందుచేతనే ఎక్కువగా అందరూ పాలు పెరుగు తింటూ ఉండేవారు.కానీ ఈ మధ్యకాలంలో బయట దొరికే పాలు తాగడం వల్ల పలు రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పాలను సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తూ ఉంటారు ఆరోగ్య నిపుణులు. అందుచేతనే ప్రతిరోజు కనీసం ఒక గ్లాసు పాలైన తాగమని చెబుతూ ఉంటారు. ఎంత చేత అంటే ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి.ఇవి మన శరీరానికి చాలా మేలు చేస్తాయి కనుక వీటిని తాగమని తెలియజేస్తూ ఉంటారు.కానీ ఎక్కువమంది పాలను తాగడానికి ఇష్టపడరు. ఎక్కువగా బ్రూ, టి వంటి వాటిని తాగడానికి ఇష్టపడతారు. అయితే పాలను తాగడం వల్ల ఎన్ని రకాలు ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పాల ద్వారా మన శరీరంలో అనేకమైన ప్రోటీన్లు లభించడమే కాకుండా విటమిన్ D,B-2, పొటాషియం వంటివి అనేక పోషకాలు కూడా లభిస్తాయి. అయితే ఆరోగ్య నిపుణులు ప్రకారం పచ్చిపాలు తాగకుండా కాస్త వేడిపాలు తీసుకుంటే పలు పోషకాలు పెరుగుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. వేడి పాలు తాగడం వల్ల యాంటీ బ్యాక్టీరియల్ గా ఇవి పనిచేస్తాయి. అంతేకాకుండా పలు రకాల దగ్గు, జలుబు నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.

ముఖ్యంగా వేడి పాలు తొందరగా జీర్ణమవుతాయి. వేడి పాలలో బీపీని కంట్రోల్ చేసే ప్రోటీన్స్ చాలానే ఉంటాయని వైద్యులు తెలియజేస్తున్నారు. అందుచేతనే వేడి పాలు తాగడం వల్ల మన శరీరం కూడా కాస్త వెచ్చగా ఉంటుంది తేమనుండి రక్షిస్తూ ఉంటుంది.

ప్రతిరోజు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం వల్ల మనం ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. తక్కువ ఆహారం తినేవారు బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు రాత్రి సమయాలలో ఒక గ్లాసు పాలు తాగితే చాలా మంచిదట. ఇలా రాత్రి సమయాలలో పాలు తాగడం వల్ల మంచి నిద్రతో పాటు శరీరం చాలా ఫిట్నెస్ గా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: