వంటింట్లో దొరికే దాల్చిన చెక్కతో ఎన్ని లాభాలో తెలుసా..?

Divya
దాల్చిన చెక్కలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెప్పవచ్చు.. ముఖ్యంగా మైగ్రేన్ సమస్యతో బాధపడేవారు దాల్చిన చెక్కను నీటితో బాగా అరగదీసి ఆ మిశ్రమాన్ని నుదుటిపైన రాసి ఒక 5 నిమిషాల పాటు మసాజ్ చేసినట్లు అయితే తలనొప్పి నుండి విముక్తి కలుగుతుందట. ఇక గొంతు కూడా బొంగురు పోయినప్పుడు దాల్చిన చెక్కను నోట్లో వేసుకొని చప్పరించడం వల్ల ఆ రసం గొంతులోకి వెళ్లి గొంతు బొంగురును తగ్గిస్తుంది.. ఇక అంతేకాకుండా దగ్గు కూడా ఉన్నట్లు అయితే అది పూర్తిగా తగ్గిపోతుంది. కడుపులో ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి దాల్చిన చెక్క ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది.

ఎవరైనా నొప్పుల నుండి ఉపశమనం పొందాలి అంటే కాస్త దాల్చిన చెక్క పొడిలోకి.. తేనె కలుపుకొని పేస్టులాగా చేసి వాటిని నొప్పి ఉన్నచోట రాయడం వల్ల ఆ నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. మధుమేహ బాధితులకు కూడా దాల్చిన చెక్క ఒక దివ్య ఔషధంలో పనిచేస్తుంది.. ప్రతిరోజు ఉదయాన్నే ఏమి తినకుండా ఒక అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని గోరువెచ్చని నీటిలో తాగడం వల్ల షుగర్స్ లెవెల్ తగ్గిపోతాయి. అయితే క్రమం తప్పకుండా వీటిని ఒక 40 రోజులపాటు పాటిస్తూ ఉండాలి.

ఈ డయాబెటిస్ అదుపులోకి తీసుకోవడం వల్ల గుండె సమస్యలను దూరం చేసుకోవచ్చు.. దాల్చిన చెక్కలలో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి అందుచేతనే.. పలు రకాల క్యాన్సర్లను కూడా నిరోధిస్తుంది. ముఖ్యంగా మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాలను కూడా దూరం చేస్తుందని చెప్పవచ్చు. ఇక దాల్చిన చెక్కన కనీసం వారంలో ఒకసారైనా తీసుకున్నట్లయితే రక్త సరఫరా బాగా మెరుగుపడుతుందని నిపుణులు సూచిస్తూ ఉన్నారు. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో దాల్చిన చెక్క పొడి నిమ్మరసం కలిపి వేస్ట్ లాగ పట్టించుకున్నట్లు అయితే మొటిమలు బ్లాక్ హెడ్స్ వంటివి మాయమవుతాయి. ఇలా వారం రోజులపాటు చేస్తే క్రమం తప్పకుండా ఫలితం లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: