నిత్యం ఫిట్ గా వుండాలంటే ఇవి తినండి!

Purushottham Vinay
బరువు తగ్గి ఫిట్ గా అవ్వడానికి మీరు కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలను ఆహారంలో చేర్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. విత్తనాలు వేగంగా బరువు తగ్గడంలో మీకు బాగా సహాయపడతాయి. దీనిలో భాగంగా ఆహారంలో అనేక రకాల విత్తనాలను మీరు చేర్చుకోవచ్చు. వాటిలో పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి జీవక్రియను వేగవంతం చేయడంలో బాగా సహాయపడతాయి. మీరు వాటిని అనేక విధాలుగా కూడా తినవచ్చు. మీరు వాటిని సూప్‌లు ఇంకా సలాడ్‌ల రూపంలో తీసుకోవచ్చు.గుమ్మడికాయ గింజలను మీరు స్నాక్స్‌గా తీసుకోవచ్చు. ఇందులో ప్రొటీన్లు ఇంకా ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అవి మిమ్మల్ని ఎక్కువ కాలం సంతృప్తిగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే గుమ్మడికాయ గింజల్లో జింక్ కూడా పుష్కలంగా ఉంటుంది. అవి జీవక్రియను మెరుగుపరచడానికి బాగా పని చేస్తాయి. ఇక ఈ విత్తనాలను అనేక విధాలుగా వేయించి లేదా నానబెట్టడం ద్వారా తినవచ్చు. ఈ విత్తనాలు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో బాగా సహాయపడతాయి. కాబట్టి ఈ విత్తనాలు వేగంగా బరువు తగ్గడానికి చాలా ఈజీగా సహాయపడతాయి.ఇంకా అవిసె గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ గింజలు చెడు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తాయి.అలాగే ఇవి రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేస్తాయి. వీటిల్లో ప్రొటీన్ కూడా ఉంటుంది. ఇందులో డైటరీ ఫైబర్ ఇంకా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే గర్భధారణ తర్వాత అవిసె గింజలను తినడం తరచుగా సిఫారసు చేస్తారు. ఇవి పొట్ట కొవ్వును తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతాయి.


చియా విత్తనాల్లో ప్రోటీన్‌ చాలా పుష్కలంగా ఉంటుంది. శాకాహారులకు ఇది చాలా మంచి ఆహారం. ఇక ఈ విత్తనాలను ఆహారంలో భాగంగా చేర్చుకోవచ్చు. ఇవి వేగంగా బరువు తగ్గడంలో బాగా సహాయపడతాయి. వాటి రుచి కూడా చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ పరిమాణంలో తినడం చాలా మంచిది. మీరు ప్రతిరోజూ రెండు టీస్పూన్ల చియా విత్తనాలను కూడా తినవచ్చు. మీరు దీన్ని అనేక విధాలుగా కూడా తినవచ్చు. సలాడ్‌లు ఇంకా అలాగే సూప్‌లలో కూడా తీసుకోవచ్చు.పొద్దుతిరుగుడు గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి వేగంగా బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఈ గింజల్లో ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్ ఇ, ఫోలేట్ ఇంకా కాపర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గించే ఆహారంలో పొద్దుతిరుగుడు విత్తనాలను చేర్చుకోవడం చాలా ఉత్తమం. ఈ విత్తనాలను సలాడ్లుఇంకా జ్యూస్‌లలో తీసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: