పిల్లల మెదడుని చురుగ్గా ఉంచే సూపర్ డ్రింక్!

Purushottham Vinay
చిన్న పిల్లల మెదడును చురుగ్గా మార్చే బాధ్యత ఖచ్చితంగా తల్లిదండ్రులదే. అప్పుడే వారు చదువుల్లో బాగా రాణించి జీవితంలో బాగా సెటిల్ అవ్వగలుగుతారు. వారి భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది.వారికి చిన్నతనం నుంచీ పిల్లల డైట్‌లో పోషకాహారం ఉండేలా చూసుకోవాలని తల్లిదండ్రులకు ఆరోగ్య నిపుణులు ఎప్పటికప్పుడు సూచిస్తూనే ఉంటారు. కానీ, కొందరు పిల్లలు ఏం పెట్టినా తినడానికి చాలా మారాం చేస్తుంటారు. ఇక ఇప్పుడు చెప్పబోయే డ్రింక్‌ను వారి చేత ప్రతి రోజు తాగిస్తే.. మెదడు అభివృద్ధితో పాటు ఆరోగ్యం సైతం చాలా అద్భుతంగా మెరుగుపడుతుంది. మరి లేటెందుకు ఆ సూపర్ డ్రింక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక టేబుల్ స్పూన్ వేరెశెనగలు, నాలుగు బాదం పప్పులు, ఒక టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు, ఒక టేబుల్ స్పూన్ సన్ ఫ్లెవర్ సీడ్స్ వేసుకుని వాటర్ పోసి నైటంతా కూడా నానబెట్టుకోవాలి.ఇక ఉదయాన్నే నానబెట్టుకున్న వాటిని రెండు సార్లు కడగాలి. 
అలాగే బాదం పప్పులకు ఉన్న తొక్కను కూడా తొలగించి.. వాటి అన్నిటినీ బ్లెండర్‌లో వేసుకోవాలి. ఆపై అందులో తొక్క తొలగించిన ఒక అరటి పండు ఇంకా ఒక సపోటా పండు, ఒక గ్లాస్ పాలు, అర గ్లాస్ వాటర్‌, రెండు టేబుల్ స్పూన్ల బ్రౌన్ షుగర్‌, ఒక టేబుల్ స్పూన్ తేనె వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే హెల్తీ అండ్ టేస్టీ డ్రింక్ రెడీ అవుతుంది.


ఒక గ్లాస్ చొప్పున దీనిని ప్రతి రోజు కూడా పిల్లల చేత తాగిస్తే.. పిల్లల మెదడు చాలా చురుగ్గా మారుతుంది. దాంతో వారి జ్ఞాపకశక్తి ఇంకా అలాగే ఆలోచనా శక్తి రెండూ కూడా బాగా పెరుగుతాయి.అలాగే వారు చదువుల్లో కూడా బాగా రాణిస్తారు. తెలివితేటలను కూడా ప్రదర్శిస్తారు. ఇక అలాగే పైన చెప్పిన డ్రింక్‌ను పిల్లల చేత తాగించడం వల్ల.. ఖచ్చితంగా వారి ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలెన్నో కూడా అందుతాయి. రోగ నిరోధక వ్యవస్థ కూడా చాలా బాగా బలపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: