మూత్రం రంగును బట్టి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోండి..!!

Divya
ఆరోగ్యవంతమైన వ్యక్తిలో 24 గంటలలో కనీసం 6 నుంచి 8 సార్లు మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. ఇది సహజమైన ప్రక్రియ. ఇది మన ఆరోగ్యానికి కూడా ఎంతో అవసరం. ఎందుకంటే మూత్రంతో పాటు శరీరంలో ఉత్పత్తి అయ్యే టాక్సీన్ కూడా బయటకు విడుదల అవుతాయి. ఇక అంతే కాకుండా మూత్రం ద్వారా మన ఆరోగ్య పరిస్థితి కూడా తెలియజేస్తుంది. మూత్రమును ల్యాబ్ పరీక్ష కాకుండా.. కేవలం మీ మూత్రం రంగు ఆధారంగా అనేక రకాల వ్యాధులను మనం గుర్తించవచ్చు. అందుకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

ఆరోగ్యకరమైన వ్యక్తికి మూత్రం రంగు నీరు లేదా చాలా లేత పసుపు రంగులో వస్తూ ఉంటుంది. శరీరం లోపల నిరంతరం ఉత్పత్తి అయ్యే యూరో క్రోమ్ హాయ్ రసాయన అందుకు కారణం.
1). లేత పసుపు రంగు:
మనం ఒక రోజులో తాగే నీరు మన శరీరానికి సరిపోదు అని సంకేతము. అందుచేతనే మనం ఎక్కువ మొత్తంలో నీటిని తాగడం మంచిది. ఒకవేళ మూత్రపిండ వ్యాధి లేదా మధుమేహం కారణంగా కూడా మూత్రం రంగు లేత పసుపు రంగులో వస్తూ ఉంటుంది.
2). చిక్కటి పసుపు రంగు:
మూత్రం ముదురు పసుపు రంగులో వచ్చాయంటే మీ శరీరం డీహైడ్రేట్ అవుతుందని సంకేతము. ఇక మన శరీరంలో నీటి కొరత ఏర్పడుతుందని అర్థము అందుచేత ప్రతి ఒక్కరు ఎనిమిది నుంచి పది గ్లాసుల నీటిని తాగడం మంచిది.
3). మేఘావృతం లేదా పొగమంచు రంగు:
ఇలా మూత్రం వచ్చాయి అంటే తీవ్రమైన ఇన్ఫెక్షన్స్కు సంకేతం. ఇది కేవలం మూత్రాశయం ఇన్ఫెక్షన్ వల్ల ఇలా అనేక రకమైన వ్యాధుల వల్ల కూడా జరుగుతుంది.
4). ఎరుపు రంగు
మూత్రం అనేది అనేక కారణాల వల్ల మూత్రం రంగు మారుతూ ఉంటుంది. ఆహారంలో బీట్రూట్ తింటే లేదా డైట్లో దాని రసం తాగితే మాత్రం ఎరుపు గా వస్తుంది. ఒకవేళ అలా ప్రతిరోజూ వస్తోందంటే వెంటనే మనం వైద్యుని సంప్రదించాలి.
5). గోధుమ రంగులో మూత్రం వచ్చినట్లు అయితే కాలేయం లేదా పిత్తాశయం ఇన్ఫెక్షన్ కారణంగా ఇలా వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: