స్పైసీ ఫుడ్ అధికంగా తింటే కలిగే సమస్యలు ఏంటో తెలుసా..?

Divya
సాధారణంగా ఎక్కువమంది స్పైసీ ఫుడ్ ను చాలా ఇష్టపడుతుంటారు.. ఎక్కువగా నూనె ఉండే వాటిని, మసాలా ఉండే వాటిని తినడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే స్పైసీ ఆహారం తిన్న తర్వాత కొంతమందికి మాత్రం కడుపులో తిప్పినట్టు అనిపిస్తూ ఉంటుంది..అందుకే నూనె వస్తువులను, కారం అధికంగా వుండే ఆహారాలను తినకోపోవడమే మంచిది అని ఆహార నిపుణులు అంటున్నారు. దాదాపుగా ఇలాంటి ఆహారాన్ని తినకపోవడమే మంచిది అని వైద్యులు కూడా సలహా ఇస్తున్నారు. అయితే ఇలాంటి ఫుడ్ తిన్న తర్వాత కొన్ని చిట్కాలు పాటిస్తే ఎలాంటి నష్టం వాటిల్లదు.
ఎటువంటి సమయంలో నైనా ఆయిల్ ఫుడ్ తిన్న తర్వాత గోరువెచ్చని నీటిని తాగడం మంచిది. ఇక అంతేకాకుండా కడుపు సమస్యలు, ఇతర సమస్యలతో భాద పడుతుంటే గోరు వెచ్చని నీటిని తాగడం మంచిదట. అలా వేడి నీటిని తాగి నడవడం ద్వారా ఇతర సమస్యలు కూడా దూరం అవుతాయి. నూనె ఆహారం కలిగిన వాటిని తిన్న తరువాత బరువుగా అనిపిస్తే .. నడవడం వల్ల జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగుపడుతుంది. వీటితో పాటు శరీరం లో వుండే ఇతర సమస్యలు కూడా దూరం అవుతాయి.
ఆహారం వండేటప్పుడు నల్ల మిరియాలు వేసి తినడం వల్ల సమస్యలు దరి చేరవు. అలాగే ఆకుకూరలతో కూడా ఇలాంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఎండుమిర్చి, వాము పొడిని బాగా మిక్స్ చేసి.. గోరు వెచ్చని నీటితో కలుపుకొని తాగితే..అజీర్తి, గ్యాస్, గుండెల్లో మంట అన్నీ దూరం అవుతాయి. అజ్వైన్, బ్లాక్ సాల్ట్ తీసుకోవడం వల్ల కడుపు సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఆకుకూరల రసం లోకి కాస్త నల్లటి ఉప్పును జోడించి, మరిగించి, ఆ నీటిని తాగడం వల్ల శరీరంలో వుండే కొవ్వు పదార్థాలు తేలికగా జీర్ణం అవుతాయి. ఇక వీటితో పాటు మీరు తినే ఆహారం లో స్పైసీ నేస్ లేకుండా చూసుకోవాలి. అప్పుడే ఆరోగ్య సమస్యలు రాకుండా మంచి ప్రయోజనాలు కలుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: