వీటితో షుగర్, బీపీ కి చెక్ పెట్టవచ్చట..!

Divya
చాలామంది తమ జీవన శైలిలో చెడు అలవాట్లను.. అలవాటుగా మార్చుకోవడం వల్ల అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్లు అవుతోంది. సమయపాలన లేని ఆహారపు అలవాట్ల వల్ల రక్తంలో షుగర్ స్థాయి అధికమయ్యే అవకాశం ఉంటుంది. ఇక అంతే కాదు బిపి , షుగర్ వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే ఇప్పటికే కరోనా కారణంగా గత కొంత కాలం నుంచి ప్రజలు ఇంటికే పరిమితమవుతున్నారు. దీని కారణంగా శారీరక శ్రమ తగ్గిపోవడంతో ఎన్నో రోగాలు రావడం మొదలయ్యాయి.
చాలామంది ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడిపోయిన నేపథ్యంలో అనారోగ్యకరమైన ఆహారాలు తినడం వల్ల కూడా శరీరంలో కొలెస్ట్రాల్ ను  కూడా పెంచుకుంటున్నారు. ఇకపోతే గుండెజబ్బులకు కూడా  గురి అవుతున్నారు. మరొకవైపు అధిక రక్తపోటు చాలామందిలో సాధారణ సమస్యగా మారిపోయింది. అలాంటప్పుడు నిపుణులు చెబుతున్నారు అంటే ఈ వ్యాధి నుంచి మనల్ని మనం సురక్షితంగా కాపాడుకోవడానికి కొన్ని ఆహార నియమాలను పాటిస్తే సరిపోతుంది అని. మరి ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివితే తెలుస్తుంది.
నేరేడు పండ్లు:
ఇకపోతే వేసవికాలంలో అధికంగా లభించే నేరేడు పండ్లు తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. పూర్వకాలం నుంచి మధుమేహానికి నేరేడు పండ్లు మంచి విరుగుడు గా భావించడం రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరచడంలో నేరేడు పండ్లు చాలా చక్కగా పనిచేస్తాయి. ఇందులో ఉండే పొటాషియం.. అధిక బీపీ నియంత్రణలోకి కాబట్టి రెగ్యులర్ గా వీటిని తింటే గుండె పోటు వచ్చే అవకాశం కూడా ఉండదు.
బీట్ రూట్:
శరీరంలో రక్తం కొరత తక్కువగా ఉన్నప్పుడు బీట్ రూట్ తీసుకోవడం మంచిది. మధుమేహాన్ని నియంత్రించగలగడం లో కూడా బీట్రూట్ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇకపోతే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బీట్ రూట్ లో ఉండే ఫోలేట్ కారణంగా రక్తనాళాలు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. అలాగే ఇందులో ఉండే నైట్రిక్ ఆక్సైడ్ అనే రసాయనం వల్ల రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: