పిల్లలకు ఎలాంటి రోగాలు రాకుండా ఈ ఆహారం పెట్టండి..

Purushottham Vinay
ఇక పిల్లలకి ఎటువంటి ఆహారం ఇవ్వాలి అనేది ఒక సవాలుతో కూడుకున్న పనే. ఎందుకంటే కొన్నిటిని వారు తింటారు మరికొన్నిటిని తినకుండా వారు అవైడ్‌ చేస్తారు. ముఖ్యంగా చలికాలంలో అయితే అసలు పిల్లలు చిరుతిళ్లను ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. ఈ చిరు తిళ్ళు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా రుచికరంగా కూడా ఉంటాయి. కొన్ని రకాల ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో చిలగడదుంప అంటే పిల్లలకు చాలా ఇష్టమట. ఇక మీరు చిలగడదుంపను ఆలివ్ నూనెలో వేయించి వాటికి జున్ను లేదా పనీర్‌ ని కలిపి తినిపించవచ్చు. అలాగే కొంతమంది పిల్లలకు బీట్‌రూట్ అంటే అసలు ఇష్టం ఉండదు. ఇక అలాంటి పరిస్థితులలో ఏం చెయ్యాలంటే పిల్లలకు బీట్‌రూట్ తినిపించడానికి బీట్‌రూట్ స్మూతీ లేదా బీట్‌రూట్ కేక్‌లు చేయాలి. దీంతో వీటిని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు.
ఇంకా అలాగే సాల్మన్ ఫిష్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇంకా అలాగే ప్రొటీన్ వంటి అనేక ఆరోగ్యకరమైన పోషకాలు అనేవి ఉన్నాయి. వీటిని తినడం వల్ల పిల్లలకు కంటి చూపు అనేది చాలా బాగా మెరుగుపడుతుంది. అలాగే వారి బ్రెయిన్ కూడా చాలా షార్ప్‌ అవుతుంది. ఇంకా ఎలాంటి రోగాల బారిన పడకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే పిల్లలకు ఎప్పుడూ కూడా వేడి పాలు ఖచ్చితంగా ఇవ్వాలి. వెచ్చని పాలను వారు తాగడం ద్వారా వారు బాగా నిద్రపోతారు. ఇంకా అలాగే మరుసటి రోజు పిల్లలు చురుకుగా ఉంటారు. పిల్లలు పాలు కనుక తాగకపోతే అందులో రెండు బాదంపప్పులు వేసి, లేదా చాక్లెట్ పౌడర్ వేసి పాలు తాగించాలి.

ఇంకా అలాగే పిల్లలకి రాగి రొట్టెలు కూడా వారి ఆరోగ్యానికి చాలా మంచివే. ఇందులో చాలా రకాల పోషకాలు అనేవి ఉంటాయి. వీటిని పెరుగు లేదా ఊరగాయతో కలిపి వారు తినిపించవచ్చు. రాగిలో ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్ వంటి పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్‌ను సప్లిమెంట్ చేయడానికి ప్రతిరోజు కూడా పిల్లలకు తప్పనిసరిగా ఉడికించిన గుడ్లను ఖచ్చితంగా పెట్టాలి. ముఖ్యంగా పెరిగే పిల్లలకు గుడ్లు తినిపించండం అనేది వారి ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల వారి ఎదుగుదల అనేది చాలా బాగా ఉంటుంది. ఇంకా అలాగే శీతాకాలంలో చలిని కూడా తట్టుకునే శక్తి వారికి వస్తుంది.కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఈ ఫుడ్స్ ని అలవాటు చెయ్యండి. వారిని ఆరోగ్యంగా ఉంచండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: