బీట్రూట్ : హెల్త్ కి కరెక్ట్ రూట్ ?

Purushottham Vinay
బీట్‌రూట్‌ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇంకా అలాగే అనేక రకాల ఉపయోగాలు అనేవి ఉన్నాయి. ఇక చాలా మంది కూడా రక్త హీనత సమస్యతో బాధ పడుతూ వుంటారు.అందుకే ప్రతి రోజూ కూడా ఈ బీట్‌రూట్‌ జ్యూస్‌ కనుక మీరు తాగితే రక్తహీనత సమస్య అనేది అసలు ఉండదు. ఎందుకంటే ఈ బీట్రూట్ రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయిని బాగా పెంచుతుంది.ఇక అలాగే కాలేయం శుభ్రం కావడానికి కూడా బీట్‌ రూట్‌ ఎంతో ఉపయోగపడుతుంది.బీట్‌రూట్‌లో ఉండే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్‌, విటమిన్‌ ఎ ఇంకా సిలు ఎదిగే పిల్లలకు బాగా తోడ్పడతాయి. 


అలాగే పిల్లలు ప్రతి రోజూ ఒక గ్లాస్‌ బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగితే జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఆహార నిపుణులు ఇంకా వైద్యులు చెబుతున్నారు. బీట్‌రూట్‌ జ్యూస్‌ ని ప్రతి రోజూ తాగడం వల్ల మెదడుకు రక్త సరఫరా అనేది సక్రమంగా జరుగుతుంది. ఇంకా అలాగే వారి ఏకాగ్రత కూడా పెరుగుతుంది.ముఖ్యంగా గర్భిణీలు రోజూ కనుక ఒక గ్లాస్‌ బీట్‌ రూట్‌ జ్యూస్‌ తాగితే కడుపులో బిడ్డ ఎదుగుదలకు అవసరమయ్యే ఫోలిక్‌ యాసిడ్‌ అనేది వారికి అందుతుంది.

అలాగే బీట్‌రూట్‌ రక్తంలో ఉన్న కొవ్వుని కరిగించి ఎంతగానో శుద్ధి చేస్తుంది.దాంతో గుండె పనితీరు అనేది కూడా చాలా బాగుంటుంది. అందువల్ల బాడీలో రక్తపోటు అదుపులో ఉంటుంది. ఐరన్‌ సంవృద్ధిగా లభించి ఎముకలు ఎంతో దృఢంగా ఉంటాయి.గోళ్లు, వెంట్రుకలు ఇంకా అలాగే చర్మం ఎంతో ఆరోగ్యవంతంగా మారతాయి.చర్మానికి కూడా ఈ బీట్‌రూట్‌ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ బీట్ రూట్ జ్యూస్‌ను కనుక మీరు ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మ ఛాయ అనేది ఎంతగానో మెరుగుపడుతుంది.ఇక ఈ బీట్‌రూట్‌ రసం కంటిచుట్టూ కూడా ఏర్పడ్డ నల్లని వలయాలను వెంటనే నివారిస్తుంది కూడా.ఇంకా అలాగే కళ్ల ఉబ్బును కూడా తొందరగా తగ్గిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: