కేవలం రోజుకు ఒక్క గ్లాస్.. రోగాలన్నీ పరార్..!!

Divya
కరోనా మహమ్మారి ఒకవైపు విజృంభిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు ఒమిక్రాన్, మరొక వైపు చలికాలం.. ఇలాంటి అతి పెద్ద సమస్యల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి అంటే తప్పకుండా ఒక గ్లాస్ పాలు తాగాల్సిందే.. కేవలం గ్లాసు పాలతో రోగాలను దూరం చేసుకోవచ్చా అంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన వ్యాసం మీరు చదవాల్సిందే.. ఆ గ్లాస్ పాల లో ఏమేమి కలుపుతారు అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఇందుకోసం ఒక పొడిని తయారు చేసుకోవాల్సి ఉంటుంది.. అయితే ఈ పొడి కోసం ముందుగా.. స్టౌ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి.. తామర గింజలు వేసి కొద్దిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. పావు కప్పు బాదం, పావు కప్పు జీడిపప్పు, పావు కప్పు పిస్తా, రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు, పావు కప్పు వాల్ నట్స్, పావు కప్పులో సగం  ఎండు కొబ్బరి వేసి అన్నీ బాగా వేయించాలి. వీటిని వేయించేటప్పుడు తక్కువ మంట మీద వేసి వేయించడం వల్ల వీటి ఫ్లేవర్  చాలా బాగా తెలుస్తుంది. ఇలా బాగా వేయించిన వీటన్నింటిని మిక్సీ జార్ లో వేసి మెత్తగా పొడి చేసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పుడు ఈ పొడిలో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేయాలి.. ఈ పొడిని సుమారుగా 30 రోజుల పాటు నిల్వ ఉంటుంది కాబట్టి మీరు ఫ్రిజ్ లో అయినా లేదా పొడి వాతావరణంలో అయినా భద్రపరుచుకోవచ్చు. మరొక పాన్ పెట్టి అందులో పాలు పోసి మరిగేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ పొడిని వేసుకోవాలి. మరో రెండు నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత చిన్న బెల్లం ముక్క వేసి మరొక నిమిషం పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ప్రతి రోజూ ఉదయం పూట ఈ పాలను తాగడం వల్ల.. రోజంతా హుషారు గా ఉండడంతో పాటు అలసట , నీరసం , బలహీనత వంటి సమస్యలు అన్ని దూరం అయిపోయి మనిషి ఆరోగ్యంగా, యాక్టివ్ గా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: