ప్రైవేటు "కాన్పు" కోతకు చెక్.. ఎందుకో తెలుసా..!

MOHAN BABU
రాష్ట్రంలో నార్మల్ డెలివరీల శాతాన్ని పెంచేందుకు ఒకవైపు రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రయత్నిస్తుంటే, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మాత్రం సిజేరియన్లను ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ దవాఖానలో గర్భిణీలకు సిజేరియన్ డెలివరీ చేసే డాక్టర్లు,హెల్త్ స్టాఫ్ కు ఇన్సెంటివ్ ఇస్తోంది. ఒక్కో సిజేరియన్ కు రూ.3,850 చొప్పున చెల్లిస్తోంది. ఏటా సర్కార్ హాస్పిటళ్ళలో సగటున లక్షా 72 వేల సిజేరియన్ లు జరుగుతుండగా, ఈ లెక్కన సుమారు రూ.65.45 కోట్లు హెల్త్ స్టాఫ్ కు ఇన్సెంటివ్ గా  ఇవ్వనున్నారు. ఇప్పటికే సిజేరియన్లు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ టాప్ లో ఉంది.

 దీంతో ఆరోగ్యశాఖ కొంతమంది నర్సులకు 18 నెలల పాటు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చి, నార్మల్ డెలివరీ శాతాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా నార్మల్ డెలివరీలు చేస్తున్న నర్సులకు  నేషనల్ హెల్త్ మిషన్ లో నుంచి రూ.10 వేల చొప్పున చెల్లిస్తోంది. సిజేరియన్ డెలివరీలకు ఇచ్చే ఇన్సెంటివ్ ఎక్కువ ఉండడంతో హెల్త్ సిబ్బంది సిజేరియన్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. దీంతో నార్మల్ డెలివరీలు పెంచాలన్న ఆరోగ్యశాఖ లక్ష్యం నీరుగారే ఛాన్స్ ఉందని హెల్త్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. సిజేరియన్ లకు ఇన్సెంటివ్ గా ఇస్తున్నావన్ని ఆయుష్మాన్ నిదులేనని ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ ఏడాది మే మూడో వారం నుంచి రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్, ఆరోగ్య శ్రీ స్కీమును కలిపి ప్రభుత్వ దవాఖాన్లలో  అమలు చేస్తున్నారు.

 ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీని మాత్రమే కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ దవాఖాన్లలో ఎవరైనా ట్రీట్మెంట్ తీసుకుంటే, కేంద్రం నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్టుకు నిధులు వస్తాయి.  ఆయుష్మాన్ భారత్ పరిధిలో డెలివరీలు కూడా ఉన్నాయి. మన రాష్ట్రంలోని సర్కార్ హాస్పిటల్ లో జరిగే ప్రతి సిజేరియన్ డెలివరీ కి ఆయుష్మాన్ స్కీమ్ కింద కేంద్రం రూ.11 వేల చొప్పున చెల్లిస్తోంది. ఇందులో నుంచే హెల్త్ స్టాప్ కు ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. ఏటా సర్కారు దవాఖాన్లల్లో సగటున లక్షా 75 వేల సిజేరియన్లు జరుగుతున్నాయి. వీటికి ఆయుష్మాన్ కింద రూ.187 కోట్ల వరకూ కేంద్రం నుంచి వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: