జర భద్రం: డెంగ్యూ వస్తే... ఆ వ్యాధి కూడా వస్తుందా?

VAMSI
డెంగ్యూ మరియు కామెర్లు రెండు ఒకేసారి వచ్చాయా? అయితే తప్పక అత్యంత జాగ్రత్త అవసరం. అవును ఇపుడు డాక్టర్లు చెబుతున్న మాట ఇదే. డెంగ్యూ వచ్చిన వారికి కామెర్లు కూడా వస్తున్నాయట. వెంటనే గుర్తించి జాగ్రత్త పడకపోతే ప్రమాదం అవొచ్చని హెచ్చరిస్తున్నారు. కామెర్లు సాధారణంగా చిన్నారులకు ఎక్కువగా వస్తుంటాయి. కానీ పిల్లలలో వచ్చే కామెర్లకు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని, పెద్దల్లో వచ్చే కామెర్లను మాత్రం నిర్లక్ష్యం చేయరాదని అంటున్నారు ప్రముఖ వైద్య నిపుణులు. ముఖ్యంగా డెంగ్యూ ఉన్నప్పుడు కనుక కామెర్లు వచ్చినట్లయితే మరింత జాగ్రత్త తప్పనిసరి అంటున్నారు.
ఒకవేళ పెద్దలకు కనుక కామెర్లు వచ్చినట్లయితే కోలుకోవడానికి చాలా సందర్భాల్లో ఎక్కువ సమయం కూడా పడుతోందని వీరు అంటున్నారు. అంతే కాకుండా ఆరోగ్య సమస్యలు ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్‌ ఎస్‌కె సరిన్‌ ఈ అంశంపై మాట్లాడుతూ.. కొందరు డెంగ్యూ బారిన పడినవారు కామెర్ల తీవ్ర లక్షణాలను కూడా కలిగి ఉంటున్నట్లు ఆయన తెలిపారు, అది కూడా సమస్య తీవ్రంగా ఉంటోందట.  కాలేయంలో బి ల్ రుబిన్ యొక్క పరిమాణం పెరిగినప్పుడు జాండిస్ వస్తాయని ఆయన పేర్కొన్నారు. కావున డెంగ్యూ బాధితులకి జాండిస్ టెస్ట్ చేయడం కూడా అవసరమని తెలిపారు. ప్రారంభంలో లక్షణాలు పెద్దగా కనిపించినప్పటికీ తెలియకుండానే సమస్య పెద్దదయ్యే అవకాశం ఉంది అని అన్నారు. కావున మొదట్లోనే గ్రహించి నియంత్రించాలని ఆయన అన్నారు. ఈ వ్యాధి ప్రధానంగా వ్యక్తి మలం, ఆహారం, కలుషిత నీరు ద్వారా సోకుతుందని డాక్టర్ తెలిపారు.
కావున కామెర్లు లక్షణాలు తెలుసుకోవడం ఎంతైనా అవసరం.
* ప్రధానంగా కళ్ళు పసుపుగా మారుతాయి. కొన్నిసార్లు శరీరం కూడా పసుపు రంగులోకి మారుతుంది.
* మూత్రం రంగు కూడా పసుపు పచ్చగా మారుతుంది. వాంతులు ఎక్కువగా అవుతాయి.  
* మలం రంగులో రంగులో కూడా మార్పు వస్తుంది. కావున ప్రజలంతా జాగ్రత్త వహించాలి.
జాండిస్  లక్షణాలు కనుక కనిపిస్తే డాక్టర్ ని వెంటనే సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నీరు బాగా త్రాగాలి. బయట ఆహారాన్ని కనీసం కొద్ది రోజుల పాటు పూర్తిగా ఆపేయాలి. అంతే కాకుండా మద్యం తాగేవారు ఆపివేయడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: