తెలుగు రాష్ట్రాలలో.. చలిపులి..!

Chandrasekhar Reddy
తెలుగు రాష్ట్రాలలో చాలా త్వరగా ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నట్టు వాతావరణ శాఖ తెలుపుతుంది. రానున్న రోజులలో చలితీవ్రత విపరీతంగా ఉండనుందని, ప్రజలు జాగర్తలు వహించాల్సిందిగా పేర్కొంది. కార్తీక మాసం కావడంతో చలిని పట్టించుకోకుండా దీపారాధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో అయ్యప్ప మాలలు కూడా ధరించే వారు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ తరహా సన్నాహాలు కూడా ప్రతి చోట కనిపిస్తున్నాయి. నిజానికి ఇంత చలిలో కూడా ప్రాతః సమయంలో నిద్ర లేచి, దీపం ముట్టించడం హిందూ సాంప్రదాయం. దానికి కూడా కారణం ఉంది. ఈ సమయంలో యముడు కోరలు చాచే అవకాశం ఉన్నందున, లోకంలో అనేక రోగాలు ప్రబలే అవకాశం ఉంది. అవన్నీ తప్పించుకోవడానికే ఆవు నెయ్యి, నువ్వుల నూనె వంటి వాటితో దీపాలు వెలిగిస్తారు. ఆ దీపాల వేడి, దానివలన వచ్చే వాయువు ఆయా రోగాలను ప్రబలించే కారకాలను నశింపచేస్తాయన్నది ఈ సాంప్రదాయం వెనుక ఉన్న కారణం.
శాస్త్రీయంగా కూడా పలు కారణాలు చలిని పులిని చేస్తున్నాయి. దానికి కారణం తెలిసిందే, కాలుష్యం. ఎక్కడ చూసినా అది పెరిగిపోతున్నందున వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అందుకే ఈ తరహా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. ఎన్నడూ చూడని అతి ఉష్ణోగ్రతలు, ఎన్నడూ చూడని అతి చలి వాతావరణం. మానవ తప్పిదాలకు వాటి తీవ్రత పెరిగిపోతుంది. దానికి తోడుగా బంగాళా ఖాతంలో నెలకొన్న అల్పపీడనం నేపథ్యంలో మరింతగా ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉన్నది. దీనితో ఈసారి ఎన్నడూ లేని విధంగా చలిపులి చంపనుంది. ఇప్పటికే మరోసారి తమిళనాట రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయాయి. తాజా అల్పపీడనంతో మరోసారి తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఉంది. ఈ నేపథ్యంలోనే ఈఅల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉండే చిత్తూరులో పాఠశాలలు, విద్యాసంస్థలు మూసివేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం కూడా ప్రకటించింది.
తాజా అల్పపీడనం కొరైక్కాల్, శ్రీవారికోట మధ్య వాయుగుండంగా మరి తీరం దాటనుంది. ఒకపక్క వాయుగుండం, మరోపక్క ఈశాన్య ఋతుపవనాలు కారణంగా భారీ వర్ష సూచన ఉంది. ఇప్పటికే దీని ప్రభావం ఉన్న నెల్లూరు, చిత్తూరు లలో అధికారులను తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. అధికారులు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం వంటి పనులను ప్రారంభించారు. ఇదేనెలలో 13 న మరో అల్పపీడన ప్రభావం ఉండనుంది. దీని ప్రభావం కూడా ఏపీలో ఉండనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల వలన ప్రారంభంలోనే చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని, తగిన జాగర్తలు తీసుకునే బయటకు ప్రజలు రావాలని సూచించారు. తమిళనాడు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలలో తాజా అల్పపీడనం వలన వర్ష సూచన ఉంది. ఇది ఆయా ప్రదేశాలను బట్టి భారీ నుండి అతిభారీ వరకు ఉండే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో 45-65 కిమీ వేగంతో గాలులు విస్తాయి. దీనితో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని ఐఎండి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: