కరోనా దెబ్బకు.. మళ్ళీ వణికిపోతున్న న్యూజీలాండ్.. !

Chandrasekhar Reddy
కరోనా దెబ్బకు అమెరికా లాంటి దేశాలు కుదేలైపోయాయి. కనీస జాగర్తలు పాటిస్తే చాలు అని చెప్పినా వినని ప్రజానీకం ఉన్న దేశాలలో ఇలాంటి పరిస్థితులు మళ్లీమళ్లీ వస్తూనే ఉన్నాయి. ఈ నిర్లక్ష్యమే అగ్రరాజ్యాన్ని కరోనా ముందు తలదించుకునేలా చేసింది. అప్పటి నుండి ఆ దేశం కరోనా తో తీవ్రంగా పోరాటం చేస్తూనే ఉంది. సొంతగా వాక్సిన్ తయారు చేసుకుని అది అందరికి ఇవ్వడం కూడా కాస్త ఆలస్యం అవడం అక్కడ పరిస్థితులను మరింతగా దిగజార్చింది. తనకు ఈ పరిస్థితి రావడానికి నిర్లక్ష్యమే కారణం అని గ్రహించకుండా, చైనా చేసినదానికి మాకు ఇన్ని తిప్పలు అంటూ విమర్శలు చేస్తుంది. అక్కడ ఇలాంటివి ఎప్పుడు సహజమే అయినప్పటికీ, ఈసారి మాత్రం అతివిశ్వాసం బాగా దెబ్బతీసిందని చెప్పాలి.
ఇక మిగిలిన దేశాలలో కాస్త కరోనా ప్రభావం తగ్గిందని భావిస్తుండగానే ప్రజలు చాలా సాధారణ జీవితాలను గడపడం మొదలు పెట్టారు. కనీసం నిన్న తమకు ఒక సమస్య ఉన్నది అనే విషయం కూడా వాళ్ళు మరిచిపోయి, కనీస నిబంధనలు పాటించడం మానుకున్నారు. ఇదే ఇప్పుడు చాలా దేశాలలో కొంప ముంచేస్తుంది. అసలకైతే మూడవ వేవ్ పిల్లలపై మాత్రమే ప్రభావం చూపుతుంది అనుకున్నారు అందరు. కానీ అది వారి నుండి పెద్దలకు పాకేసి, సమస్యను తీవ్రతరం చేస్తుంది. అది కూడా ప్రస్తుతం డెల్టా వేరియంట్ ఉండటంతో, దాని వ్యాప్తి ముందునుండి తీవ్రంగా ఉంటుందని చెప్పినట్టే, పరిస్థితులు మారిపోతున్నాయి.
ఈ ప్రభావం చైనా, రష్యా, బ్రిటన్, తాజాగా న్యూజీలాండ్ లలో తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాలలో నిదానపడిన టీకా కార్యక్రమాలను కూడా మళ్ళీ ఉదృతం చేయాలని ఆయా వైద్యారోగ్య శాఖల అధికారులు స్పష్టం చేశారు. అలాగే సరైన కరోనా నిబంధనలు కూడా అండర్ పాటించాల్సిందే అంటూ సూచనలు చేశారు. టీకాలు వేసుకున్న వారు కూడా నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రస్తుతం న్యూజీలాండ్ లో రోజు 200పైనే కేసులు అదికూడా ఆక్లాండ్ లో నమోదవుతున్నాయి. ఇక్కడ ఆంక్షలు ఉన్నప్పటికీ కేసులు నమోదు అవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్ లో కూడా ఆరోగ్యశాఖ తాజాగా హెచ్చరికలు జారీచేసిన విషయం తెలిసిందే. మోడీ కూడా ఆయా రాష్ట్రాల ప్రతినిధులతో ఈ విషయంపై చర్చించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: