నోటి దుర్వాసన కి ఇలా చెక్ పెట్టండి..!

Veldandi Saikiran
నోటి దుర్వాసన ఇది చాలామందిలో కనిపించే సమస్య. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు చాలా మంది చాలా విధాలుగా... ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్లి డబ్బులు ఖర్చు చేస్తుంటారు. ఇక కొంత మందేమో సొంత చిట్కాలు పాటిస్తారు. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ నోటి దుర్వాసన అనే దానికి చెక్ పెట్టవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
డీహైడ్రేషన్ : నోరు ఆరిపోవడం కారణంగా మా నోటి నుంచి దుర్వాసన రావడం జరుగుతుంది. కాబట్టి డిహైడ్రేషన్ అనే సమస్య లేకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీని కోసం మనం ఎక్కువగా నీళ్లు తాగాల్సి అవసరం ఉంటుంది. మనం ఎక్కువగా నీళ్ళు తాగడం కారణంగా... నోటి నుంచి దుర్వాసన రావడం ఆగిపోతుంది.
టొబాకో ప్రొడక్ట్స్ : స్మోకింగ్ చేసే వారి నోటిలో దుర్వాసన అధికంగా వస్తుంది. కాబట్టి నోటి నుంచి దుర్వాసన అనే సమస్యను మనం దూరం చేసుకునేందుకు స్మోకింగ్ కు మొదటగా దూరం కావాలి. అంతేకాదు... మనం లంచ్ చేసిన తర్వాత కాస్త జీలకర్ర నమిలితే ఈ నోటి దుర్వాసనకు చెక్ పెట్టవచ్చు. అంతేకాకుండా ఈ జిలకర తినడం కారణంగా అజీర్ణ సమస్య కూడా తగ్గుతుంది.
 మెడికేషన్ : మనం తీసుకునే టాబ్లెట్ల కారణంగా కూడా నోటి దుర్వాసన అనేది వస్తుంది. కాబట్టి ఇ మనం టాబ్లెట్ వేసుకున్న తర్వాత నోటిని బాగా శుభ్రంగా కడగాలి. లేకపోతే మందులు వేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన నీటిని తాగితే మంచిది. అలాగే ఆ నీటిలో నిమ్మ రసాన్ని కాస్తంత పోసుకుని తాగితే మనకు జీర్ణ సమస్యలు కూడా రాకుండా ఉన్నారు.
ఎక్కువగా ఆల్కహాల్ మరియు కాఫీ తీసుకోవడం : చాలామంది కాఫీ మరియు ఆల్కహాల్ విపరీతంగా తీసుకుంటారు. వీటి కారణంగా నోటి దుర్వాసన అనేది విపరీతంగా వస్తుంది. కాబట్టి నోటిని సరిగ్గా కడిగితే సరిపోతుంది. అలాగే క్యారెట్, పాలకూర, కీరదోస మరియు సిట్రస్ పండ్లను తింటే నోటి దుర్వాసనకు చెక్ పెట్టవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: