బరువు తగ్గాలంటే ఎన్ని అడుగులు వేయాలో తెలుసా..?

MOHAN BABU
నడక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఇటీవల వైద్యులు పదేపదే చెబుతున్నారు. తమ వద్దకు వచ్చే పేషెంట్లకు ఇదే  విషయాన్ని సూచిస్తున్నారు. రోజుకు ఎన్ని అడుగులు వేయాలి, ఎంత సేపు నడిస్తే మంచిది అన్నదానిపై చాలా మందిలో సందేహాలు ఉన్నాయి. అయితే అలాంటి సందేహాలను  నివృత్తి చేసుకునేందుకు ప్రస్తుతం సెల్ ఫోన్ లో అనేక ఆప్ లు అందుబాటులోకి వచ్చాయి. ఈ యాప్ లలోనే సమగ్ర సమాచారం ఉంటుంది. నడకకు సంబంధించి బరువు, ఎత్తుకు  సంబంధించిన వివరాలు యాప్ లో అందిస్తే రోజుకు ఎన్ని అడుగులు వేయాలి. ఎంత సేపు వాకింగ్ చేస్తే ఎన్ని కేలరీల లో ఖర్చు చేయవచ్చు అన్న పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు అవి మనకు అందిస్తూ టెక్నాలజీ ద్వారా తెలియజేస్తాయి. ఈ డిజిటల్ పరికరాల రాకతో మనం రోజుకు ఎన్ని అడుగులు వేసాం.

 ఇంకా ఎన్ని అడుగులు వేయాలని  ఇట్టే తెలుసుకోవచ్చు. రోజుకు పది వేల అడుగులు వేస్తే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చు అన్న భావన చాలా మందిలో ఉంది. అయితే ఇన్నే అడుగులు వేయాలి ఇంతకుమించి అడుగులు వేయడానికి వీలు లేదు అనే నిబంధనలు ఏమీ లేవు. టెక్సాస్ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనం ప్రకారం చురుకైన వ్యక్తులు ఐదు వేల అడుగులు లేదా అంతకంటే తక్కువ వేసినప్పుడు వారిలో మరుసటి రోజు జీవ క్రియలు సక్రమంగా జరగడం లేదు. అందుకని రోజుకు ఐదు వేల అడుగుల కు తక్కువ కాకుండా చేయడం అత్యవసరం. గుండె వ్యాధులు, స్థూలకాయం, డయాబెటిస్, అధిక రక్తపోటు, డిప్రెషన్ వంటి అనారోగ్యాలను  నడక ద్వారా మన దరిచేరకుండా చూసుకోవచ్చు. వాకింగ్ చేయడం వల్ల శరీరం ఆక్సిజన్ ను ఎక్కువగా గ్రహిస్తుంది . దీంతో అదే యాక్సిడెంట్ రక్తంలో  చేరి  అది ఊపిరితిత్తులకు చేరుతుంది. ఈ క్రమంలో సదరు ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లో ఉండే టాక్సిన్  లు, విష వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతుంది. అలాగే ఇతర ఊపిరితిత్తుల సమస్యలు దూరం అవుతాయి. రోజూ వ్యాయామం చేయడం అధిక బరువును నియంత్రణలో ఉంచుకోవడం పట్ల ఇటీవల చాలామంది శ్రద్ధ చూపిస్తున్నారు. ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా శరీరం  బరువు తగ్గించుకోవడంలో నడక ఎంతగానో సహాయపడుతుంది. ఇంటి వద్ద వాకింగ్ చేయవచ్చు.

నిత్యం వాకింగ్ చేస్తే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. నిత్యం వాకింగ్ చేయడం వల్ల ఎప్పుడూ డిప్రెషన్ లో ఉండేవాళ్ళు మంచి మూడ్ కు వస్తారట. నడక వల్ల గుండె సంబంధిత వ్యాధులు 31 శాతం తగ్గుతుందని ఈ పరిశోధనలో వివరించారు మూడు నెలల పాటు వ్యాయామం చేయడం వల్ల శరీర బరువు తగ్గుతుందని వెల్లడించారు. అడుగుల సంఖ్య పెరిగే కొద్దీ ఆరోగ్య లాభాలు కూడా  పెరుగుతాయని వాళ్ళు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: