ఎముకులు ధృఢంగా ఉండాలంటే డైట్ లో వీటిని తీసుకోండి..!

Veldandi Saikiran
మన ఎముకల చాలా ఆరోగ్యంగా ఉండాలంటే...  మన డైట్‌ లో మంచి ఆహారం ఉండాల్సిందే. ఈ విషయాన్ని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే.. ఎలాంటి ఆహారం తీసుకుంటే.. మంచిది. ఎలా తీసుకోవాలి.  అనేది మాత్రం అందరికీ తెలీదు.  అయితే... ఎముకలు ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన ఆహర నియమాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నట్స్‌ తీసుకోవడం :  ప్రతి రోజూ నట్స్‌ తీసుకోవడం మన ఆరోగ్యానికి మంచిది.  ఈ నట్స్‌ లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి.  అలాగే ఇందులో ఫాస్పరస్‌ కూడా లభిస్తుంది. దీనికి కారణంగా మన ఎముకలు మరింత ధృఢంగా ఉంటాయి.  
చీజ్‌ :  చీజ్‌ లో కాల్షియం సమృద్దిగా లభిస్తుంది.  అలాగే ఎముకుల ఆరోగ్యానికి ఈ చీజ్‌ చాలా ఉపయోగ పడుతుంది.
పాలకూర తో చాలా మేలు : మనం నిత్యం తీసుకునే కూరగాయాల్లో కంటే..  పాలకూర చాలా బెస్ట్‌.  ఈ పాల కూరలో మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తుంది.  అలాగే...  ఈ పాల కూర తీసుకో వడం కారణంగా విటమిన్‌ కె సమృద్ధిగా లభిస్తుంది.  అంతే కాదండి..  మన డైట్‌ లో బ్రోకలీ మరియు క్యాబేజీ కూడా ఉంటే...  మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు అస్సలు రావు.
సాల్మన్‌ : మనం నిత్యం సాల్మన్‌ తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు.  ఎందుకంటే...  ఈ సాల్మన్‌ లో ఓఏగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ మరియు విటమిన్‌ సీ చాలా బాగా లభిస్తాయి.  అంతేకాదు.. ఈ సాల్మన్‌ ఎక్కువగా తీసు కోవడం కారణంగా మన ఎముకలు చాలా బలంగా తయారవు తాయి.
చికెన్ తినటం : చికెన్‌ తినటం కొందరు ఆనారోగ్యం అనుకుంటారు.  కానీ చికెన్‌ తినడం ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ చికెన్‌ లో ఎక్కువగా ప్రోటీన్‌ లభిస్తుంది.  కాబట్టి మనం తీసుకునే ఆహారంలో చికెన్‌ ఉంటే.. మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాలేవు అన్న మాట.  ప్రతి వారం లో కనీసం రెండు సార్లు అయినా... చికెన్‌ తినేలా ప్లాన్‌ చేసుకుంటే...  మన ఎముకలకు మంచింది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: