ఈ మనుషుల ఆకలి తీరేదెప్పుడు..?

MOHAN BABU
భారతదేశంలో పేదరికం, ఆకలి కారణంగా పోషకాల లోపంతో పిల్లలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 37.51 కోట్ల మంది పిల్లలు పోషకాహారం లభించక ఎదుగుదల, బలం లేక ఆందోళన చెందుతున్నారు. దీనివలన వారు ఎక్కువగా  బరువు కూడా అతి తక్కువగా కనిపిస్తూ ఉన్నారు. పోషక విలువలు గల ఆహారాన్ని వీరికి అందించడానికి వివిధ కార్యక్రమాలను చేపట్టడానికి అవి లబ్ధిదారులకు అందడంలేదు. 14 కోట్ల మంది బడికి వెళ్లే నిరు పేద పిల్లలకు ప్రభుత్వం ఇచ్చే మధ్యాహ్న భోజనం కరోనా కారణంగా బడులు బంద్ కావడంతో 17 నెలలుగా దూరం అయింది. పేదరికానికి మించిన శాపం లేదు. ప్రపంచానికి బీదరికం అత్యంత భారంగా మారింది. పేదరికం వల్ల తిండి సరిగా దొరకగా మరణిస్తున్న వారి సంఖ్య ఏటా లక్షల్లోనే ఉంటుంది. కరోనా వ్యాప్తి వేగంగా జరిగినప్పుడు దేశ రాజధాని ఢిల్లీ నగరంలో అన్నదానం చేసే వాహనాల వైపు కోట్లాది మంది కార్మికులు పరుగులు తీసిన దృశ్యాలను మర్చిపోలేము.

అంతకుముందు విందులు, వినోదాల్లో భారీగా మిగిలిన అన్నాన్ని వృధాగా పారవేయడం చూశాం. ఇప్పటికీ ఇంకా చూస్తూనే ఉన్నాం. సోమాలియా లాంటి దేశాల్లో తిండి దొరకక ప్రజలు పడిన బాధలవిషాదభరిత దృశ్యాలు కంటతడి పెట్టించాయి. నేటికీ మన దేశంలోని ఆదివాసి ఏజెన్సీ ప్రాంతాల్లో అలాంటి దృశ్యాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. పిల్లలు బక్కచిక్కి, కండ్లు జీరబోయి, పొట్ట ఉబ్బి అనారోగ్యంగా కనిపిస్తారు. వీరంతా ఆహార లోపంతో వచ్చే మరాస్మాస్, క్వాషియార్కర్ లాంటి వ్యాధుల బారిన పడుతున్నారు.

కరోనా కాలంలో వలస కూలీల ఆకలికేకలు, చావులు చూశాం. దేశం ఇంకా ఆ దృశ్యాలను మరిచిపోలేదు. భారతదేశంలో పేదరికం ఆకలి కారణంగా పోషకాల లోపంతో పిల్లలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.37.52 కోట్ల మంది పిల్లలు పోషకాహారం లభించక ఎదుగుదల బలం లేక ఆందోళన చెందుతున్నారు. ఈ విధంగా భారతదేశంలో ఆహార లోపం వలన ఎంతోమంది పిల్లలు తీవ్రమైన ఆకలితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  దీంతో వారిలో పోషకాహార లోపం అనేది తీవ్రంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: