కరోనాని కట్టడి చేసే టీకా జూన్ నుంచి అందరికి అందుబాటు..

Purushottham Vinay
DRDO వారు అభివృద్ధి చేసిన మొదటి బ్యాచ్ యాంటీ-కోవిడ్ డ్రగ్ 2-DG ను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విడుదల చేసిన తరువాత, ఇది ఎయిమ్స్, సాయుధ దళాల ఆసుపత్రులు, DRDO ఆస్పత్రులు మరియు అవసరమైన ఇతర ప్రదేశాలకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇక జూన్ మొదటి వారం నుంచి దేశంలోని అన్ని ఆసుపత్రులకు ఈ డ్రగ్ ని అందుబాటులో ఉంచాలని DRDO చైర్మన్ జి సతీష్ రెడ్డి తెలపడం జరిగింది.

ఇక యాంటీ-కోవిడ్ డ్రగ్ 2-GG మొదటి బ్యాచ్ పరిమిత పద్ధతిలోమాత్రమే ప్రస్తుతం ఉపయోగించబడుతుంది. ఇది ఎయిమ్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్ హాస్పిటల్స్, DRDO ఆస్పత్రులు మరియు అవసరమైన ఇతర ప్రదేశాలలో ఉపయోగించబడుతుంది. జూన్ నుండి ఇది అన్ని ఆసుపత్రులకు అందుబాటులో ఉంటుందని DRDO చైర్మన్ సతీష్ రెడ్డి ఈ రోజు విలేకరులతో అన్నారు.ఇంకా ఉత్పత్తి జరుగుతోంది. రెండవ బ్యాచ్ మే చివరి వారంలో ఇది పూర్తవుతుందని తెలిపారు.రెండవ బ్యాచ్‌లో ఉత్పత్తి వ్యవధి పెరుగుతుందని, జూన్ మొదటి వారం నుంచి దేశంలోని అన్ని ఆస్పత్రులు, ఇతర వైద్య సదుపాయాలకు ఇది అందుబాటులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఇక ఈ టీకా పనితనం గురించి మాట్లాడారు. ఈ టీకా నేరుగా కరోనా సోకిన కణాలపై పనిచేస్తుందని తెలిపారు.అంతేకాక వాటిలో కలిసిపోయి ఇది వైరస్ను లెక్కించి దాన్ని అరికట్టి  అలాగే ఇతర ఆరోగ్యకరమైన కణాలు నాశనం అవ్వకుండా ఆపుతుందని తెలిపారు. అంతే గాక ఇది రోగి రోగనిరోధక వ్యవస్థపై కూడా చాలా మెరుగ్గా పనిచేస్తుందని తద్వారా వ్యక్తి వేగంగా కరోనా నుంచి కోలుకుంటాడని తెలిపారు.ఇక ఈ టీకాను కరోనా సోకిన వ్యక్తి రోజుకు రెండు సార్లు చొప్పున ఐదు నుండి ఏడు రోజుల వరకు ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇది ఆ వ్యక్తి బరువు ఇంకా వైద్యుడి ప్రిస్క్రిప్షన్ మీద తీసుకోవాలని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: