బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే వీటిని అస్సలు తినవద్దు...

Divya

మనలో చాలా మంది స్తూలకాయంతో  ఎంతో బాధ పడుతున్నారు. అయితే వాతావరణంలో కలిగే మార్పుల కారణంగా, శరీరంలో కలిగే మార్పుల కారణంగా,  అలాగే తీసుకునే ఆహారంలో సరైన పద్ధతి, పోషణ లేకపోవడం వల్ల కూడా చాలామంది బరువు పెరుగుతుంటారు. అయితే ఈ బరువును తగ్గించుకోవడానికి ఎంతో మంది ఎక్సర్సైజులు, యోగాలు చేస్తూ, డైట్ మెయింటైన్ చేస్తున్నారు.. అంతేకాకుండా బరువు తగ్గాలనుకునే  చాలామంది అన్నం తినడం కూడా మానేస్తున్నారు.. అయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని పండ్లను తినకుండా ఉంటే మంచిదని చెబుతున్నారు వైద్యులు.

మనలో చాలామంది తాజా పండ్లను తీసుకుంటే బరువు తగ్గుతామని అపోహలో ఉంటారు. కానీ కొన్ని పండ్లను తింటే బరువు తగ్గడానికి బదులు పెరిగే ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు..  అయితే ఏ పండ్లు తినకూడదో తెలుసుకుందాం..

మనం డైటింగ్ చేసేటప్పుడు తినే పండ్ల ఎంపిక చాలా ముఖ్యం.  డైటింగ్ చేసే సమయంలో కూడా కొన్ని తినకూడని పండ్లు ఉన్నాయి.  అందులో ముఖ్యంగా అరటిపండు.  అరటి పండు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే మీరు బరువు తగ్గాలని ఆలోచిస్తుంటే అరటిపండు తినే ముందు ఇప్పుడు చెప్పబోయే కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇందులో క్యాలరీలు పుష్కలంగా ఉంటాయి. అరటిలో 150 కేలరీలు ఉంటాయి. ఇది సుమారు 37.5 గ్రాముల కార్బోహైడ్రేట్ల తో సమానం. ఒకవేళ మీరు కనుక బరువు తగ్గాలనుకుంటే మాత్రం ఈ అరటి పండ్లను అసలు తినవద్దు..

అలాగే ద్రాక్ష.. ద్రాక్షలో కూడా చక్కెరతో పాటు కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. 100 గ్రాముల ద్రాక్ష లో 67 క్యాలరీలు, 16 గ్రాముల చక్కెర ఉంటుంది.  కాబట్టి బరువు పెరిగే ప్రమాదం చాలా ఉంది. అలాగే  ఎండు ద్రాక్ష లో కూడా ఎక్కువ కేలరీలు ఉంటాయి. మరీ ముఖ్యంగా ఒక కప్పు ఎండు ద్రాక్ష లో 500 కేలరీలు ఉంటాయి. మీరు గనుక డైటింగ్ చేసేటప్పుడు ఈ ఆహారం తీసుకుంటే  మీరు ఇంకా బరువు పెరగడం ఖాయం.. అలాగే అవకాడో, మామిడిపండ్ల కు కూడా దూరంగా ఉండాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: