చర్మ సౌందర్యం కోసం అరటి పండు తో ఫేస్ ప్యాక్, ఎలా అంటే...?

kalpana
 అరటిపండు ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలిసినదే. అరటిపండును ఇష్టపడిన వాళ్లు కూడా ఉండరు. ఎంతో  ఇష్టంగా తింటారు. అరటిపండు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగపడుతుంది. అది ఎలా ఉపయోగపడుతుందో, వాటి వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో  ఇప్పుడు తెలుసుకుందాం...
 సగం అరటిపండు గుజ్జు, సగం అవకాడో పండు గుజ్జు రెండింటినీ బాగా కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. ఆ పేస్ట్ ను ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఫలితంగా ముఖం కాంతివంతంగా ఉంటుంది.
 సగం అరటిపండు గుజ్జును ముఖాన్ని శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడుచుకోవాలి. ఆ తర్వాత  ఆ గుజ్జును ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖము మృదువుగా ఉంటుంది.
 సగం అరటిపండు గుజ్జు, ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి, మెడకు బాగా అప్లై చేయాలి. పదహైదు  నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్ర పరుచుకొని మెత్తని గుడ్డతో తుడుచుకోవడం వల్ల కోమలమైన చర్మం మీ సొంతం అవుతుంది.
 మొటిమలకు అరటిపండు ఫేస్ ప్యాక్ బాగా  ఉపయోగపడుతుంది. ఒక అరటిపండు గుజ్జు, ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మూడింటిని బాగా కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి వల్ల మొటిమలు,  మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు తగ్గిపోతాయి.
 పొడి చర్మం ఉన్నవాళ్లుకు అరటిపండు ఫేస్ ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా  తయారు చేయాలి. సగం అరటి పండు గుజ్జు, సగం గిన్నె ఉడికించిన ఓట్ మీల్, ఒక స్పూను చక్కెర, ఒక గుడ్డులో ఉండే పచ్చసొన అన్నింటినీ బాగా కలిపి ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి.
 జిడ్డు చర్మం ఉన్న వాళ్లకి అరటిపండు,తేన, పెరుగు  ఫేస్ ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది. దీన్ని తయారు చేయడానికి సగం అరటి పండు గుజ్జు, ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ పెరుగు మూడింటినీ కలిపి ముఖానికి ముఖానికి అప్లై చేసి 20నిమిషాల తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి.
 ముఖం పై ముడతలు పోగొట్టడానికి సగం పండు గుజ్జు టేబుల్ స్పూన్ తేనె, ఒక గుడ్డులోని పచ్చసొన అన్నింటినీ కలిపి ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల ముఖం పై ఉన్న ముడతలు పోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: