ఈ చిట్కాల ద్వారా కడుపులో నులి పురుగులను నివారించవచ్చు..!

kalpana
చిన్నపిల్లల తలెత్తే సమస్యలలో నులిపురుగుల సమస్య ఒక్కటి. సాధారణంగా ఈ నులిపురుగులు చిన్న పిల్లల్లో 85 శాతం వరకు ఉంటాయి. ఈ నులిపురుగులను బద్దె పురుగులు, సూది పురుగులు అని కూడా పిలుస్తుంటారు. పిల్లల కడుపులో ఉండటం వల్ల తరచు ఆరోగ్యానికి గురవుతుంటారు. చిన్న పిల్లల కడుపులో నులి పురుగులు విధంగా ప్రవేశిస్తాయి? వాటిని ఏ విధంగా నివారించవచ్చు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం...                                                           
చిన్న పిల్లల కడుపులో నులిపురుగులు మట్టిలో ఆడుకోవడం వల్ల, కలుషిత నీరు, ఆహారం సరిగ్గా ఉడకని మాంసాహారం తీసుకున్నప్పుడు కడుపులో నులిపురుగులు పడుతుంటాయి. పిల్లలు ఎక్కువగా మట్టిలో ఆడుకోవడం వల్ల మట్టిలోని సూక్ష్మజీవులు కడుపులోకి చేరడం వల్ల నులి పురుగులు ఏర్పడతాయి. ఈ నులిపురుగులు ఉన్నప్పుడు చిన్న పిల్లలు రోజురోజుకి బరువు తగ్గుతారు. కడుపు నొప్పి, తలనొప్పి, వాంతులు, సరిగా నిద్రపోకపోవడం వంటి లక్షణాలు కనపడతాయి.అయితే కడుపులో నులిపురుగుల సమస్యతో బాధపడేవారికి ఈ సులువైన చిట్కాలు ద్వారా నివారించవచ్చు.
నులి పురుగుల సమస్యతో బాధపడే చిన్నపిల్లలకు వెల్లుల్లి మంచి ఔషధంగా పనిచేస్తుంది.వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉండటం వల్ల నులిపురుగులను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రెండు వెల్లుల్లి రెబ్బలను బాగా దంచి ఆ రసంలో కొద్దిగా చిన్న గ్లాసు నీటిని కలిపి తాగించడం ద్వారా కడుపులో నులిపురుగులను నివారించవచ్చు. అదేవిధంగా పిల్లలకు ఎల్లప్పుడూ బాగా కాచి చల్లార్చిన నీటిని తాగించాలి.అదేవిధంగా రెండు లవంగాలను ఒక గ్లాసు నీటిలో వేసి ఆ నీటిని తాపడం వల్ల కడుపులో నులి పురుగులను నివారించవచ్చు. అదే విధంగా మట్టిలో ఆడుకుంటున్న పిల్లలకు కాళ్ళు చేతులు శుభ్రంగా కడగాలి. ఈ చిన్న చిట్కాలను పాటించడం ద్వారా పిల్లలకు నులిపురుగుల సమస్య నుంచి విముక్తి కలిగించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: