దగ్గు,జలుబు తో ఇబ్బంది పడుతున్నారా?

Divya

పూర్వకాలంలో దగ్గు,జలుబు అంటే ఎక్కువగా శీతాకాలంలోనే వచ్చేవి. ప్రస్తుతం సీజన్తో సంబంధం లేకుండా తీసుకునే ఆహార పదార్థాల కారణంగా తరచూ దగ్గు,జలుబు వంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. వీటిని తగ్గించుకోవడానికి కొంతమంది ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే మరికొంతమంది డాక్టర్లను సంప్రదిస్తున్నారు. కేవలం దగ్గు,జలుబుకు ఎన్ని రకాల మాత్రలు,మందులు,టానిక్కులు వాడినప్పటికీ కొంతమందిలో త్వరగా ఫలితం లభించదు. జలుబు కారణంగా నలుగురిలో తిరగలేక ఇబ్బందిపడుతుంటారు. అంతేకాకుండా ముక్కు నొప్పి రావడం, గొంతులో పట్టేసినట్లు ఉండడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇక దగ్గు కారణంగా ధమనులలో విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలంటే ఇప్పుడు చెప్పబోయే చిట్కాను పాటించి సమస్యనుంచి బయటపడవచ్చు.
 
ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కఫం.కఫం  సామాన్యంగా శ్వాసకోశం, గొంతు నుండి శ్లేష్మం  ఉత్పత్తి అయ్యి,అది  ఊపిరితిత్తులలోకి చేరి అసౌకర్యాన్ని కలగజేస్తుంది.గొంతు గరగరగా ఉండడం,గొంతులో ఏదో అడ్డు పడినట్లు ఉండటం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపించడం,ఊపిరితిత్తుల భాగంలో శబ్దం వచ్చినట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి అంతేకాకుండా చల్లని వాతావరణంతో పాటు చల్లని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కఫం అనే సమస్య ఎదురవుతుంది.  ఇలాంటి సమస్య నుంచి బయట పడాలంటే ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు మీరు ఒకసారి పాటించండి.
 కావలసిన పదార్థాలు
 పిప్పళ్ళు
 పిప్పలి మూలం
 చవ్యం
 చిత్రమూలం
 ఎండిన అల్లం.
తయారీ విధానం:
పైన చెప్పిన అన్ని పదార్ధాలు ఆయుర్వేద దినుసులు అన్ని అంగళ్ళలో కచ్చితంగా దొరుకుతాయి. వీటిని సేకరించి ఎండబెట్టి బాగా మెత్తగా దంచి పొడి చేసుకొని, పలుచని వస్త్రంలో జల్లించుకోవాలి. ఇప్పుడు ఈ చూర్ణం చాలా మెత్తగా ఉంటుంది. దీన్ని ఒక గ్లాసు సీసాలో భద్రపరుచుకోవాలి,
ఒక చెంచా పొడిని,250 మిల్లీ లీటర్ల మంచి నీళ్ళలో వేసి బాగా కలిపి స్టవ్ మీద మరిగించాలి. ఈ నీరు పావుభాగం వచ్చే వరకు బాగా మరిగించాలి. ఫలితంగా ఒక చిక్కటి .కషాయం తయారవుతుంది. దీనిని వడగట్టి తాగాలి. కావాలనుకునేవారు కొద్దిగా తీపిని కూడా చేర్చుకోవచ్చు
ఇలా చేయడం వల్ల కఫం  చాలా వేగంగా తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: