జున్ను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Divya

మనలో చాలామందికి జున్ను అంటే ఇష్టం ఉండదు. మరి కొంతమందేమో అదేపనిగా మార్కెట్ నుంచి తెచ్చుకుని తింటారు. ఈ జున్ను కేవలం ఆవులు గేదెలు ఈనిన తర్వాత  ఆ పాలలో మూడు నుంచి ఆరు రోజుల వరకు  జున్ను తయారవుతుంది. వీటినే ముర్రుపాలు జున్నుపాలు అని పిలుస్తుంటారు. ముర్రుపాలలో  బెల్లం లేదా చక్కెర కలిపి బాగా వేడి చేయడం ద్వారా పాలు పదార్థం లాగా తయారవుతాయి.
జున్ను చాలా మృదువుగా, మెత్తగా తినడానికి రుచికరంగా ఉండడంతోపాటు శరీరానికి కావలసిన ఎన్నో రకాలైన  ప్రోటీన్లను,అధిక మోతాదులో కేలరీలను కూడా అందిస్తుంది.అయితే జున్ను తినడం వల్ల కేవలం శరీరానికి ప్రోటీన్లు అందడమే కాకుండా ఎన్నో రకాల రోగాలను కూడా తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా జున్నుపాలలో ఎక్కువ మోతాదులో ప్రోటీన్లు ఉంటాయి. వీటికి బెల్లం కలిపి తినడం వల్ల ఆ ప్రోటీన్లు రెట్టింపయ్యే అవకాశం ఉంది. ఆహారంలో ఒక భాగంగా జున్నును  చేర్చుకోవడం వల్లశారీరకంగా బలహీనంగా ఉన్నవారు జున్ను తినడం వల్ల మంచి శారీరక పుష్టి ఏర్పడుతుంది.మనలో చాలామంది ప్రోటీన్ల కోసం జీడిపప్పు,బాదంపప్పు, పిస్తాపప్పు లాంటి ఖరీదైన పప్పులు తీసుకొచ్చి తింటుంటారు. వీటి ద్వారా లభించే ప్రోటీన్లు రెట్టింపు స్థాయిలో జున్ను తినడం వల్ల లభిస్తాయి.జున్ను తినడం వల్ల శారీరక పుష్టి తోపాటు శరీరంలో వేడి తగ్గడం,కడుపులో పైత్యం తగ్గించడం,మంచి నిద్ర పట్టడానికి సహకరించడం,రక్తంలోని మలినాలను తొలగించడం,గుండెకు బలాన్ని చేకూర్చడం,గొంతు నొప్పి లాంటి సమస్యలను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇలా ఎన్నో రకాల రోగాలను అదుపు చేయగల శక్తి జున్నుకు ఉంది.
కానీ జున్ను అందరికీ వంటపట్టుతుందని చెప్పలేము. జున్ను వంటపట్టని వారికి జలుబు,దగ్గు,జ్వరం, ఆయాసం,కీళ్ల నొప్పులు, నడుము నొప్పి లాంటి సమస్యలు ఎదురవుతాయి. జున్నులో ఎక్కువగా ప్రోటీన్లు,కొవ్వులు విటమిన్లు అధికంగా ఉండడం వల్ల జీర్ణమవడానికి ఆలస్యం అవుతుంది. తద్వారా జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు జున్ను తినడం వల్ల వాతం,కఫం పెరిగి అధిక బరువుకు దారితీస్తుంది. కాబట్టి జున్ను పాలలో మిరియాల పొడి వేసి కాచి తీసుకోవడం వల్ల పైన చెప్పుకున్న సమస్యలు దరిచేరవు. కానీ జున్ను సహజ పద్ధతిలో లభించినది మాత్రమే తింటే ఫలితాలు కలుగుతాయి. కృత్రిమంగా తయారుచేసే జున్నుకు దూరంగా ఉండటం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: