చ‌లికాలంలో ఉల‌వ‌లు తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

Kavya Nekkanti
సాధార‌ణంగా ఉల‌వ‌ల‌ను ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఒక్కో ప్రాంతంలో వీటిని ఒక్కో పేరుతో పిలుస్తారు. ఉలవలంటే గుర్తుకువచ్చేది ఉలవచారు. ఇక ఉల‌వ‌లు అంటే మ‌న తెలుగు వారికి అమిత‌మైన ఇష్టం. ఉలవల్లో పోషక పదార్థాలు చాలా ఉన్నాయి. ఎదిగే పిల్లలకు ఇవి టానిక్‌లా  పనిచేస్తాయి. ఉలవలు తింటే రవ్వంత కూడా కొవ్వు చేరదు. అందుకే అన్ని వయసుల వారూ నిశ్చింతగా వీటిని తినొచ్చు. ఉల‌వ‌ల్లో ఐర‌న్‌, కాల్షియం, పాస్ఫ‌ర‌స్‌, ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి మ‌న శ‌రీరానికి చ‌క్క‌ని పోష‌ణ‌ను అందిస్తాయి.


ఫైబ‌ర్ ఉండ‌డం వ‌ల్ల ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిలు, ర‌క్త‌పోటు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. మ‌ధుమేహం అదుపులో ఉంటుంది. గుండె స‌మస్య‌లు రాకుండా ఉంటాయి. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగుప‌డుతుంది. ఉలవలు శరీరంలో ఉష్ణాన్ని పెంచుతాయి.  అందువల్ల వీటిని చలికాలంలో తప్పనిసరిగా తీసుకోవాలి. ఆయుర్వేదంలో విరివిరిగా ఉపయోగించే ఉలవలు శరీరంలో కొలెస్ట్రాల్ అధిక బరువు తగ్గించేందుకు ఉపయోగపడతాయి. ఆహారంలో ఉలవలు తీసుకుంటే  స్థూలకాయం తగ్గుతుంది.


మూత్రాశయంలో రాళ్లతో బాధపడేవారు ఉలవలు తింటే త్వరలోనే రాళ్లు కరిగి కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది. మూత్ర సమస్యలు ఉన్నవారు ఒక కప్పు చొప్పున ఉలవచారు, కొబ్బరి నీరు కలిపి తీసుకుంటుంటే ఉపశమనం కలుగుతుంది. మొలకెత్తిన ఉలవలు సులభంగా జీర్ణం అవుతాయి.  రుమాటిజమ్, పైల్స్ చికిత్సకు ఉపయోగిస్తారు. అదేపనిగా రోజూ ఉలవలు తినటం వల్ల వేడిచేయవచ్చు. అందుకే ఉలవలు తిన్నరోజున తగినంత మజ్జిగ కూడా పుచ్చుకుంటే ఈ సమస్య రాదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: