పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా పతనమైన ధరలు..!

Satvika
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలకు బ్రెకులు పడ్డాయి. నిన్న ఆకాశానికి నిచ్చెనలు వేసిన పసిడి ధరలు నేడు మార్కెట్ లో భారీగా కిందకు దిగి వచ్చాయి. అందుకు కారణం కూడా ఉందని తెలుస్తుంది. రష్యా- ఉక్రెయిన్ మధ్య తీవ్రంగా యుద్ధం సాగుతోన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ మేరకు మన దేశంలో చాలా వస్తువుల పై  ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్ అలాగే బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కాగా, దేశంలో వీటిపై ప్రభావం కాస్త ఎక్కువగానే పడింది.

అందులో భాగంగా నిన్న పైకి కదిలిన పసిడి ధరలు నేడు మార్కెట్ లో మాత్రం కిందకు దిగి వచ్చింది.. మన హైదరాబాద్ లో పసిడి ధరలను ఒకసారి చూస్తె తగ్గాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు..తెలుగు రాష్ట్రాల లో షాక్ ఇస్తున్నాయి. తెలంగాణాలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్ జిల్లాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం... హైదరాబాద్ లో బంగారం ధరల వివరాల్లోకి వెళితే.నిన్న పెరిగిన ధరలు ఇవాళ మాత్రం ఒక్కసారిగా కిందకు దిగి వచ్చింది.. హైదరాబాద్ మార్కెట్‌ లో నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 440 ఉండగా, రూ. 51,110 కు చేరింది.

అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 తగ్గి రూ. 46,850 వద్ద కొనసాగుతుంది.. ఇక వెండి ధరలు కూడా నిన్న భారీగా పెరిగాయి. కేజీ వెండి ధర రూ.2700 తగ్గి రూ. 70,000 గా నమోదు అయింది.. ఇది మగువలకు చక్కటి న్యూస్ అనే చెప్పాలి. పసిడి ధరలను చూస్తున్న వారందరికి ఇది చక్కటి న్యూస్. ఈరోజు బంగారాన్ని కొనుగోలు చేయాలనీ భావించె వారికి మంచిది. అందుకే బంగారు దుకాణాల వద్ద జనాలు క్యూ కడుతున్నారు.. అంతర్జాతీయ మార్కెట్ లో కూడా బంగారం, వెండి ధరలు భారీగా కిందకు దిగివచ్చాయి.. రేపు మార్కెట్ లో పసిడి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: