ఈరోజు బంగారం ధరలు... ప్రపంచ మార్కెట్ ఎఫెక్ట్

Vimalatha
ఈరోజు నవంబర్ 26న భారతదేశంలో బంగారం ధరలు కేవలం రూ.10 / 10 గ్రాములకు తగ్గాయి. గత 2 రోజుల్లో పసిడి ధరలు గణనీయంగా తగ్గిన తర్వాత, ఈరోజు భారతదేశంలో 22 క్యారెట్ల బంగారం ధరలు రూ. 46,620 / 10 గ్రాములుకు, 24 క్యారెట్ల బంగారం ధరలు రూ. 47,620 / 10 గ్రాములకు చేరుకున్నాయి. చాలా నగరాల్లో బంగారం ధరలు నేడు రూ. 10 నుంచి 40 / 10 గ్రాములు తగ్గాయి. ముఖ్యంగా భారతీయ ప్రధాన నగరాలైన హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై వంటి సిటీల్లో ఈ ధరలు మారే అవకాశం ఉంటుంది.
నిన్న USA లేబర్ మార్కెట్ డేటా ప్రచురించింది. వారం వారీ నిరుద్యోగ క్లెయిమ్‌ లు 71,000 తగ్గి 199,000 కి పడిపోయాయి. ఇది మునుపటి వారం సవరించిన అంచనాల 268,000 క్లెయిమ్‌ ల నుండి తగ్గింది. అదనంగా బ్యూరో ఆఫ్ ఎకనామిక్ అనాలిసిస్ (BEA), USA, ఈరోజు వ్యక్తిగత వినియోగ వ్యయాలు (PCE) ధర సూచిక అక్టోబర్‌లో 0.6% పెరిగి 5% YOYకి చేరుకుంది. ఈ రెండు నివేదికలు ప్రపంచ మార్కెట్ల లో నేటి బంగారం ధరలను ప్రభావితం చేశాయి.
PCE పై USA , BEA నివేదిక 31 సంవత్సరాల లోపు జీవన వ్యయం అత్యంత వేగంగా పెరిగింది. అంతకు ముందు యూఎస్ దేశం వారి cpi డేటాను ప్రచురించింది. ఇది అక్టోబర్‌లో 6.2%కి పెరిగింది. ఇవి అధిక ద్రవ్యోల్బణ రేటును సూచిస్తాయి. ఇది బంగారం ధరలలో స్వల్ప లాభాలకు దారి తీయవచ్చు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మాత్రమే కాకుండా భారతదేశంలో బంగారం ధరలు మితమైన రేటుతో కోట్ అవుతున్నాయి.  అంటే ఇండియాలో బంగారం ధరలు, పెరగడం తగ్గడంపై కూడా ప్రపంచ గోల్డ్ మార్కెట్, యూఎస్ నిరుద్యోగ క్లెయిమ్‌ వంటివి కూడా ప్రధాన కారణం అవుతాయి. అయితే ప్రపంచ మార్కెట్ తో పోల్చుకుంటే ఇండియాలో మాత్రం ధరలు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ కేవలం దాని ప్రభావము వల్ల ధర పెరగడం లేదా తగ్గడం మాత్రమే జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: