పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. పెరిగిన వెండి ధర.. !!

Satvika
ఇలాంటి వార్తలు అంటే మహిళలకు ఎంతో ఇష్టం.. మార్కెట్ లో బంగారం ధరలు ఊరట కలిగిస్తున్నాయి.. బంగారం కొనాలనె వారికి ఓ రకంగా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు పసిడి ధరలు నిలకడగానే ఉన్నాయి. నిన్నటి ధరతో పోలిస్తే ఈరోజు ధరలు స్థిరంగా ఉన్నాయి  .. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా అదే దారిలో నడిచింది.. ఈరోజు మాత్రం వెండి ధర జిగేల్ మంది. విదేశీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు కిందకు దిగి వచ్చాయి.

ఇకపోతే హైదరాబాద్ మార్కెట్ లో మంగళవారం బంగారం ధరలను చూస్తే.. పసిడి ధర ల్లో మార్పులు లేవు.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. ఈ మేరకు బంగారం ధర రూ.48,110 వద్దనే ఉంది. కాగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. రూ.44,110 వద్ద స్థిరంగా నమోదు అవుతున్నాయి..
 

పసిడి ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పరుగులు పెడుతుంది.. రూ.100 పతనమైంది. దీంతో కేజీ వెండి ధర రూ.73,500కు పెరిగింది. విదేశీ మార్కెట్‌లో కూడా పసిడి ధరలు దిగొచ్చింది. పసిడి ధర 1877 డాలర్లకు చేరింది. వెండి రేటు మాత్రం 28.96 డాలర్లకు తగ్గింది.. బంగారం ధరల పై చాలా అంశాలు ప్రభావాన్ని చూపిస్తున్నాయి.. కరోనా తగ్గిన బంగారం ధరలు మాత్రం తగ్గలేదు.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

బంగారం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు..
బంగారం కొనుగోల్లు చేయాలని భావించే వాళ్ళు ముందుగా ఆభరణాల డిజైన్ ను ఎంచుకొవాలి. తర్వాత క్వాలిటీ ని చెక్ చెసుకొవాల్సి ఉంటుంది. ఈ మధ్య నకిలీ బంగారం కూడా దుకాణాలలొ దొరుకుతుంది. అంతేకాదు హాల్ మార్క్ ఉండేలా చూడాలి. అప్పుడే మనం మొసపొము.. ఇది గమనించగలరు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: