పైకి కదిలిన పసిడి ధరలు.. పదిలంగా వెండి..!!
హైదరాబాద్ లో నిన్నటి ధర 22 క్యారెట్లు 44,100 రూపాయలు ఉండగా, 24 క్యారెట్లు 48,100 ఉంది. ఇక నేడు మార్కెట్ లో బంగారం ధర 100 రూపాయల మేర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,200 ఉండగా, 24 క్యారట్ల 10 గ్రాముల ధర రూ.48,200 ఉంది. ఇక పోతే ఈరోజు వెండి ధరల లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఒక్కో రాష్ట్రం లో ఒక్కో విధంగా నమోదు అవుతున్నాయి. హైదరాబాద్ లో వెండి ధరలను చూస్తే.. కిలో వెండి ధర రూ.73,400 ఉంది.
అంతర్జాతీయ మార్కెట్ లో కూడా బంగారం ధరలు పెరిగాయి. కొత్త ఆభరణాలు వినియోగం పెరగడం తో మార్కెట్ లో ధరలు పెరిగాయని చెప్పాలి. మరో వైపు కరోనా ఇవన్నీ కూడా పసిడి ధరలపై ప్రభావాన్ని చూపిస్తున్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. బంగారం ధరలు ఒక్కో రోజు ఒక్కో విధంగా ఉంటున్నాయి. ఆభరణాలు కొనుగోలు చేసేవాళ్ళు ముందుగా ధరలను తెలుసుకొని వెళ్లడం మంచిది. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి.. ప్రస్తుతం గోల్డ్ ఆభరణాలపై నిర్దేశించిన ధరలకే అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే..