పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర..!!

Satvika
బంగారం కొంటున్నారా? అయితే మీ పండినట్లే.. నిన్న కాస్త దిగిన పసిడి ధరలు ఈరోజు షాక్ ఇచ్చే రేంజులో తగ్గాయి. ఒక్కసారిగా మార్కెట్ లో ధరలు కిందకు పడిపోవడంతో మహిళలు ఒక్కసారిగా ఆభరణాలను కొనుగోలు చేసేందుకు పరుగులు పెడుతున్నారు. బంగారం ధర దిగిరావడం ఇది వరుసగా రెండో రోజు కావడం గమనార్హం. బంగారం ధర పడిపోతే.. వెండి రేటు మాత్రం పరుగులు పెట్టింది. గ్లోబల్ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గితే, వెండి రేటు పెరిగింది. విదేశీ మార్కెట్ లో పసిడి ధరలు నేల చూపులు చూస్తున్నాయి.

ఇండియాలో ఈరోజు ధరలను గమనిస్తే..హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.310 దిగొచ్చింది. దీంతో రేటు రూ.48,290కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. ధర రూ.300 క్షీణతతో రూ.44,250కు దిగొచ్చింది. అదే సమయంలో వెండి కూడా జిగేల్ మంటుంది. బంగారం ధర పెరిగినా, తగ్గినా కూడా వెండి ధర లపై ప్రభావం చూపిస్తుంది.

నిన్న వెండి ధరలు తగ్గితే ఈరోజు షాక్ ఇస్తుంది.వెండి రేటు మాత్రం పైకి కదిలింది. కేజీ వెండి ధర రూ.400 పెరిగింది. దీంతో రేటు రూ.73,300కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర నేలచూపులు చూస్తోంది. బంగారం ధర ఔన్స్‌కు 0.12 శాతం తగ్గుదలతో 1824 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పెరిగింది. ఔన్స్‌కు 1.43 శాతం పెరుగుదలతో 27.43 డాలర్లకు దిగింది. మరో విషయమేంటంటే ఈ బంగారం ధరలు పెరగడానికి ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అంశాలు ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మరి రేపటి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: