నేలను చూస్తున్న పసిడి ...ఎందుకో తెలుసా ...!?
ప్రజలు కోరుకుంటారు. బంగారం ధరలు పెరిగేకొద్దీ... విదేశీ వాణిజ్య లోటు పెరుగుతుంది. ఎందుకంటే మన దేశం పెద్ద ఎత్తున బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. అందువల్ల ధర పెరిగితే... మరింత ఎక్కువ మొత్తానికి కొనాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుంది.నూతన సంవత్సరంలో భారీగా పెరిగిన బంగారం ధరలు తాజాగా పతనమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు క్షీణించాయి. కరోనా వైరస్ వ్యాప్తి సమయం నుంచి దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. నూతన సంవత్సరంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజధానిలో ధరలు క్షీణిస్తున్నాయి.పసిడి ధర నేలచూపులు చూస్తోంది.పసిడి కొనుగోలుదారులకు ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా నడిచింది. .వేలల్లో పతనమైంది
ఈ రోజు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.46,310 ఉంది. .అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ50,070ఉంది. .విజయవాడ, హైదరాబాద్ లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,300 మేర దిగొచ్చింది. దీంతో 10 గ్రాముల ధర రూ.50,500కి పతనమైంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర .46,300 వద్ద మార్కెట్ అవుతోంది.అలాగే వెండి ధరలు మూడు రోజుల్లో రూ.5,500 తగ్గి... తాజాగా స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.68,100ఉంది.తులం వెండి ధర ప్రస్తుతం.681 .
బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. దేశంలో కరోనాకి వ్యాక్సిన్ జనవరి 16 నుంచి వేయబోతున్నారు. అందువల్ల ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకుంటుంది. తద్వారా పెద్ద ఎత్తున డబ్బు ప్రజల మధ్య పంపిణీ అవుతుంది. దాంతో... బంగారం కొనుగోళ్లు పెరుగుతాయి. అందువల్ల బంగారానికి మంచి రోజులు వచ్చినట్లే అంటున్నారు ఇన్వెస్టర్లు. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి