బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. రూ. 2 లక్షల లోపు..

న్యూఢిల్లీ: బంగారం కొనాలని అందరికి ఉంటుంది. ఏదైనా శుభకార్యం ఉందంటే ముందుగానే ఎవరైనా ఆలోచించేది బంగారం గురించే. ప్రతి ఒక్క ఇంట్లో బంగారం కూడా ఒక భాగమే అని చెప్పాలి. ఇప్పుడు తెలుగు వారి పండుగ సంక్రాంతి రావడంతో బంగారం కొనాలనుకునే వారి సంఖ్య పెరిగింది. అయితే బంగారం కొనే వారికి కేంద్ర ఆరోగ్య శాఖ ఒక శుభవార్త చెప్పింది. రూ. 2 లక్షల లోపు నగదు లావా దేవీలు చేసే వినియోగదారులు ఎటువంటి కేవైసీ వివరాలు సమర్పించాల్సిన అవసరం లేదని కేంద్రం వెల్లడించింది.

రూ. 2 లక్షల కంటే ఎక్కువ ధరకు బంగారం కొన్న వారు మాత్రమే కేవైసీ వివరాలను సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. గదేడాది డిసెంబర్ 28న రెవెన్యూ శాఖ ఓ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ తాజాగా వివరణ ఇస్తూ రూ. 10 లక్షలు.. అంత కంటే ఎక్కువగా బంగారం ఇతర లోహాలు కొనుగోలు చేసే వారు మాత్రమే కేవైసీ సమర్పించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. ఒక దశలో 1,889 డాలర్లుగా ట్రేడవడంతో ఈ ప్రభావం దేశీయ బంగారం ధరలపై కూడా పడింది.

శుక్రవారం మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 614 తగ్గింది. దీంతో పది గ్రాముల బంగాధం 24 క్యారెట్స్ ధర మార్కెట్‌లో ప్రస్తుతం రూ. 49,763గా ఉంది. బంగారంతో పాటు వెండి రేటు కూడా రూ. 1,609 మేర తగ్గింది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 67,518కు చేరింది. ఇదిలా ఉంటే.. 2020 నవంబర్, డిసెంబర్ నెలల్లో భారతదేశం నుంచి బంగారం ఎగుమతులు ఫ్రీ కోవిడ్ స్థాయికి ఎదిగాయి. బంగారం ఇతర లోహాలకు చెందిన జెమ్స్ అండ్ జువెలరీ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: