పసిడి ప్రియులకు శుభవార్త.. త్వరలో ఐదు వేలకు పడిపోనున్న బంగారం ధర..!!

Satvika
పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త.. ప్రస్తుతం ఉన్న బంగారం రేట్లతో బంగారం కొనాలంటే చాలా మందికి భయం పుడుతుంది.ఎందుకంటే రేట్లు అంతగా పెరిగాయి. ఈ ఏడాది ఆరంభం నుంచే పసిడి జోరు మీదుంది. బంగారం ధర కొండెక్కడంతో చాలా మంది కొనుగోలుకు దూరంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అందుకే పసిడి డిమాండ్ కూడా పడకేసింది.అయితే ఇప్పుడు పసిడి ప్రియులకు ఓ వార్త సంతోషాన్ని అందిస్తుంది.వచ్చే ఏడాదిలో పసిడి ధర పడిపోవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. కరోనా వైరస్ వ్యాక్సిన్ నేపథ్యంలో బంగారం ధర దిగిరావొచ్చని బులియన్ మార్కెట్ నిపుణులు తాజాగా వెల్లడించారు..



రానున్న కొత్త ఏడాదిలో బంగారం ధరలు ఏకంగా ఐదు వేలకు పడిపోతాయని అంటున్నారు.కొత్త ఏడాది కల్లా కరోనా వ్యాక్సిన్ మార్కెట్‌లోకి వస్తే ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.45,000 స్థాయికి పడిపోవచ్చని ఎస్కార్ట్ సెక్యూరిటీ రీసెర్చ్ హెడ్ అసిఫ్ ఇక్బాల్ తెలిపారు..మరో రెండు మూడు రోజులలో బంగారం ధరలు భారీగా దిగొస్తాయని అంచనా.. కాగా నిన్న బంగారం ధరలు జిగేల్ మన్న సంగతి తెలిసిందే.. ఈరోజు మాత్రం ఊరట కలిగిస్తున్నాయి..



హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కేవలం రూ.10 క్షీణించింది. రూ.51,380కు తగ్గింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.10 తగ్గుదలతో రూ.47,100కు తగ్గింది. బంగారం ధరల మీదే వెండి ధరలు కూడా ఆధారపడి ఉన్నాయి.వెండి ధర మాత్రం స్థిరంగానే కొనసాగింది. రేట్లలో ఎలాంటి మార్పు లేదు. వెండి ధర రూ.66,700 వద్దనే ఉంది... ఈ నెల ఎలా జరిగినా కూడా కొత్త ఏడాదికి బంగారం ధరలు మాత్రం భారీగా తగ్గనున్నాయని జనం ఆనందం తో ఉన్నారు.. వారి కళ ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: