మళ్లీ భారీగా తగ్గిన బంగారం ధరలు..!

Suma Kallamadi
గడిచిన రెండు రోజుల్లో బంగారం ధరలు పెరిగాయి. అయితే రెండు రోజులుగా పెరుగుతున్న ధరలు బుధవారం పడిపోయాయి. ఇక మధ్యాహ్నం సమయానికి వెండి 0.83 శాతం పడిపోయిందని నిపుణులు వెల్లడించారు. ఇక కిలో వెండి రూ.2,863 తగ్గి రూ.67,135కి చేరింది. ఇక 10 గ్రాముల పసిడి ధర రూ.53,424 పలికిందని నిపుణులు వెల్లడించారు. క్రితం సెషన్‌లో రూ.54,856 వద్ద క్లోజ్ అయిందన్నారు. మంగళవారం పోలిస్తే రూ.1,180 క్షీణించిందని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఔన్స్ 2,005 డాలర్లుకు చేరింది. వెండి పెరిగి 28.15 డాలర్లకు చేరుకుంది. స్పాట్ గోల్డ్ ఔన్స్ 0.7 శాతం తగ్గి 1,987 డాలర్లు పలికిందని నిపుణులు తెలిపారు.


బంగారం ధరలు  తగ్గుముఖం పట్టినట్టే పట్టి గత రెండు రోజుల్లో రూ.1500 వరకు పెరిగింది. అయితే ఈ రోజు దాదాపు రూ.1400కు పైగా పడిపోయిందని నిపుణులు తెలిపారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు ఒడిదుడుకుల్లో ఉండటంతో దేశీయ మార్కెట్లో పసిడి, వెంటి ధరలు క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరల్లో అనిశ్చితి నెలకొందని నిపుణులు వెల్లడించారు.


అయితే బంగారం ధరలు గత మూడు నెలల్లో 18 శాతం పెరిగాయని నిపుణులు తెలిపారు. అంతేకాక రష్యా వాక్సిన్ పైన ప్రస్తుతం కొన్ని అనుమానాలు ఉన్నాయన్నారు. అది విజయవంతమైనా లేదా మరిన్ని దేశాల వ్యాక్సీన్లు వచ్చినా బంగారం ధరల పతనం పది శాతం నుండి పదిహేను శాతం వరకు ఉండవచ్చునని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అంటే రూ.5వేలు అంతకంటే ఎక్కువగా తగ్గే అవకాశాలు ఉండొచ్చు. అప్పుడు రిటైల్ సేల్స్ పెరిగే అవకాశముందని నిపుణులు వెల్లడించారు.


ఇక నేడు హైదరాబాద్‌లో బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రూ.55,300 పైన చేరువైంది. 22 క్యారెట్ల పసిడి రూ.50,700 పలికింది. పరిశ్రమ యూనిట్లు, నాణెపు తయారీదారుల నుండి డిమాండ్ పలికింది. గ్లోబల్ మార్కెట్, కరోనా, కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, డాలర్ వ్యాల్యూ, వడ్డీ రేట్లు వంటి ప్రభావం పసిడిపై ఉంటుందని నిపుణులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: