బంగారు, వెండి ధరలకు రెక్కలు...!

Suma Kallamadi

బంగారం ధరలు రోజు రోజుకు రికార్డు స్థాయి ధరలు పలుకుతున్నాయి. గత వారం రోజులలో బంగారం వెండి ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇక తాజాగా గోల్డ్ ఫీచర్స్ లో 10 గ్రాముల బంగారం ధర రూ. 1000 పెరిగి రూ. 52,127 కు చేరుకుంది. అలాగే కేజీ వెండి ధర 5.5 శాతం పెరిగి రూ. 3000 పైగా పెరిగి రూ. 64,999 కి చేరుకుంది. దీంతో బంగారం రెండు శాతం, అలాగే వెండి దాదాపు ఆరు శాతం వరకు పెరిగాయి.

 

 

అయితే శ్రావణ మాసం ప్రారంభం అవడంతో వచ్చేది పెళ్లిళ్లు, పండుగల సీజన్ కాబట్టి బంగారం మరింతగా పెరుగుతున్నాయి అన్న వదంతులను బులియన్ మార్కెట్ నిపుణులు కొట్టిపారేస్తున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇందుకు ముఖ్య కారణం డాలర్ ధర పడిపోవడం, కేంద్ర బ్యాంకులు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం వంటి వివిధ కారణాలతో ఔన్స్ ధర 15 శాతం పెరిగి 1934 డాలర్లకు చేరుకుంది. అత్యధికంగా  ఔన్స్ ధర 1943 డాలర్లకు చేరుకుంది.

 

 

అయితే అతి త్వరలో రెండు వేల డాలర్లకు చేరిందని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అంతేకాదు ఈ బంగారం విలువలు రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల కారణంగా కూడా ఇంకా పెరగవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక మొత్తానికి రూ. 529 రూపాయలు పెరిగిన 10 గ్రాముల బంగారం రూ. 51,964 కు చేరింది. అలాగే కిలో వెండి కూడా రూ. 3722 పెరిగి రూ. 64 945 కు చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: