బంగారం: వావ్.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఈసారి ?

Durga Writes

బంగారం ధరలు గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయ్. గత రెండు నెలలుగా కరోనా వైరస్ కారణంగా భారీగా పెరిగిన బంగారం ధర ఇప్పుడు తగ్గుతూ వస్తుంది. అయితే ఎంత తగ్గిన సామాన్యులకు అందని రేంజ్ లోనే ఉంది. తులం బంగారం 44 వేలకు చేరింది. కేవలం రెండు నెలలలో బంగారం ధర 7 వేలు పెరిగింది. 

 

నేడు బంగారం, వెండి ధరలు హైదరాబాద్ మార్కెట్ లో ఇలా కొనసాగుతున్నాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 570 రూపాయిల తగ్గుదలతో 46,200 రూపాయలకు చేరింది. ఇంకా ఇదే నేపథ్యంలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 540 రూపాయిల తగ్గుదలతో 43,410 రూపాయలకు చేరింది. ఇలా బంగారం ధరలు భారీగా తగ్గగా వెండి ధర కూడా భారీగా తగ్గింది.  

 

దీంతో నేడు కేజీ వెండి ధర 1,520 రూపాయిల తగ్గుదలతో 41,000 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ, ఆర్ధిక రాజధాని ముంబైలోను బంగారం ధరలు ఇలానే భారీగా తగ్గాయి. అయితే బంగారం ధరలు తగ్గటానికి కారణం అంతర్జాతీయంగా బంగారంపై భారీగా డిమాండ్ తగ్గింది అని అందుకే తగ్గాయి అని అంటున్నారు మార్కెట్ నిపుణులు.

 

ఇక బంగారం ధరలు ఎంత తగ్గిన కొనే స్థితి లేదు. దీనికి కారణం కరోనా వైరస్ ఏ.. వైరస్ నియంత్రించాలని లాక్ డౌన్ కొనసాగుతుంది. ప్రజలెవరూ కూడా బయటకు వచ్చేకి అవకాశం లేకుండా పోయింది.                                                    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: