బంగారం: భారీగా పతనమైన బంగారం ధర.. అయినా మాకు వద్దంటున్న ప్రజలు!

Durga Writes

అవును.. మీరు చదివింది నిజం.. బంగారం ధర నిన్న ఒక్క రోజే 12 వందలు రూపాయిలు తగ్గింది. అయినా సరే.. మాకు వద్దు అంటున్నారు  ప్రజలు. ఎందుకంటే? బంగారం ధర సాధారణంగా ఉండాలిసింది 31 వెయ్యి. అలాంటిది.. కేవలం ఆరు అంటే అరే నెలల్లో బంగారం ధర 10 వేల రూపాయిలు పెరిగింది. 

 

బంగారం ఎక్కువ కొనేదే మధ్య తరగతి ప్రజలు. అలాంటి ప్రజలకు ఈ బంగారం ధర ప్రస్తుతం అందనంత ఎత్తులో ఉంది.. నిన్నటికి నిన్న ఏకంగా 12వందలు తగ్గిన బంగారం ధర ఈ రోజు కూడా అదే కంటిన్యూ అయ్యింది.. నేడు బుధవారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 30 రూపాయిల తగ్గుదలతో 44,700 రూపాయిలు చేరగా.. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 30 రూపాయిల తగ్గుదలతో 40,970 రూపాయలకు చేరింది. 

 

ఇంకా వెండి ధర కూడా భారీగా తగ్గింది. కేజీ వెండి ధర 150 రూపాయిల తగ్గుదలతో 50,000 రూపాయలకు చేరింది. ఇలా హైదరాబాద్ లో బంగారం ధరలు కొనసాగుతుండగా విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇలాగె కొనసాగుతున్నాయి. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50 తగ్గుదలతో 40,810 రూపాయలకు చేరింది. 

 

వెండి ధర రూ.49వేలకు చేరింది. విశాఖపట్నం మార్కెట్లోనూ ఇవే ధరలు నడుస్తున్నాయి. ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. బంగారంపై భారీ డిమాండ్ తగ్గటం వల్లే ఇలా బంగారం ధరలు తగ్గాయని అంటున్నారు మార్కెట్ నిపుణులు. మరి బంగారం ధర రేపు ఎంత ఉంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: