ఈరోజు మార్కెట్ లో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే?

Satvika
బంగారం కొనేవారికి చేదు వార్త.. నిన్న తగ్గిన ధరలు నేడు షాక్ ఇస్తున్నాయి.నిన్న భారీగా తగ్గిన ధరలు ఈరోజు మళ్లీ పెరిగాయి. బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల క్యారెట్ల బంగారం ధర రూ.400 మేర పెరగ్గా, అదే సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.440 మేర పెరిగింది. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,620గా ఉంది. అయితే వెండి ధరలు మాత్రం కాస్త తగ్గాయి. కేజీ వెండిపై రూ. 200 తగ్గి రూ. రూ.55, 400కు చేరుకుంది..వెండి వస్తువులను కొనాలని అనుకోనేవారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి..

మన దేశంలోని ప్రధాన నగరాల్లొ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. హైదరాబాద్‌ లో 22 క్యారెట్ల బంగారం తులం ధర ప్రస్తుతం రూ.46,400గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర హైదరాబాద్‌లో రూ.50,620పలుకుతోంది .. విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,400 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,620 వద్ద కొనసాగుతోంది.విశాఖపట్నం లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,400 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,620 వద్ద ఉంది. బెంగళూరు లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,450గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,670పలుకుతోంది. చెన్నై లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,800గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,050పలుకుతోంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,400గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,620వద్ద కొనసాగుతోంది.ఢిల్లీ లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,400గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల రూ.50,620 పలుకుతోంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,400గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాములు రూ.50,620కు లభిస్తోంది. కేరళ లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,400గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,620 వద్ద ఉంది.. వెండి ధరలు మాత్రం కిందకు దిగి వచ్చాయి.శనివారం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.61,600గా ఉంది. విజయవాడ, విశాఖ, చెన్నై, బెంగళూరు, కేరళ నగరాల్లోనూ ఇదే ధరకు వెండి లభిస్తోంది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో రూ. 55,400 పలుకుతోంది..మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: