హైదరాబాద్ "సీఐటీడీ" లో పీజీ కోర్సులు...!!!
హైదరాబాద్ లోని బాలానగర్ లో గల సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వశాఖ కు చెందిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ లో 2019-21 కి గాను పీజీ కోర్సుల్లో ప్రవేశాలకి దరఖాస్తులు కోరుతోంది. కోర్సు వివరాలు, కాల వ్యవధి, సీట్ల మొత్తం నోటిఫికేషన్ లో వివరించ బడ్డాయి.
కోర్సు: ఎంటెక్ (మెకట్రానిక్స్).
కాల వ్యవధి: రెండేళ్లు (నాలుగు సెమిస్టర్లు).
మొత్తం సీట్లు: 32
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి కనీసం 55 శాతం మార్కులతో
మెకానికల్/ఈసీఈ/ఈఈఈ/ఈఐఈ/మెకట్రానిక్స్/ఆటోమొబైల్/ ఏరోనాటికల్ విభాగంలో బీఈ/బీటెక్
ఉత్తీర్ణత.
వయసు: 45 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్లో దరఖాస్తు
చేసుకోవాలి. (దరఖాస్తును ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుని పూరించిన దరఖాస్తును
పోస్టు ద్వారా పంపించాలి).
దరఖాస్తుకు
చివరితేదీ: జులై 16, 2019. (రూ.500 ఆలస్య రుసుముతో జులై 20, 2019 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు).
ఫ్రవేశ పరీక్షతేదీ: జులై 24, 2019.
పరీక్ష కేంద్రం: జేఎన్టీయూహెచ్, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కూకట్పల్లి,హైదరాబాద్.
పూర్తి వివరాలకు
వెబ్సైట్: www.citdindia.org