విద్యార్ధులూ...పరీక్షల ఒత్తిడిని ఇలా జయించండి

Bhavannarayana Nch

ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాలలో విద్యార్ధుల ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయి..ఎన్నో కలలతో తమకు ఇష్టమైన చదువులలో రాణించాలని..వస్తున్నా విద్యార్ధులు..ఒక పక్క కాలీజీల ఒత్తిడి..మరోపక్క తల్లితండ్రుల ఒత్తిడులతో తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్ధులు పసి వయసులోనే ఇలా ప్రాణాలని కోల్పోవడం వారి తల్లి తండ్రులకి తీరని శోఖమే.. అసలు ఇటువంటి పరిస్థితులని ఎలా అధిగమించాలి?

పిల్లల్లో ఈ ఒత్తిడి ప్రభావాన్ని ఎలా గుర్తించాలి అనేది తెలుసుకుందాం


పిల్లలో వచ్చే మార్పుని ఇలా గుర్తించండి:

ఎక్కువగా ఒత్తిడికి లోనయ్యే పిల్లల్లో సరిగా నిద్రపట్టదు..ఆకలి లేకపోవడం..ఉత్సాహం తగ్గిపోవడం వంటివి విద్యార్థుల్లో డిప్రెషన్‌కు మొదటి గుర్తు.భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే ఆలోచన..చిన్న అపజయం వచ్చినా ఎందుకు పనికి రాము అనే భావన రావడం వల్ల వారు నలుగురిలో కలవలేరు. ఎక్కువగా మాట్లాడలేరు.చిరాకుగా కూడా ఉంటారు

 

ఒత్తిడిని జయించడానికి కొన్ని పద్దతులు

వారికి నచ్చిన ఆటలు ఆడటం..పాటలు పాడటం..బొమ్మలు గీయడం ..ఏదన్నా సంగీత పరికరాన్ని వాయించడం వంటివి చేయడం వల్ల విద్యార్ధుల్లో ఒత్తిడిని తగ్గించవచ్చు అంటున్నారు పరిశోధకులు.

 

విద్యార్ధులు తమకు ఎదురవుతున్న సమస్యలని సవాళ్ళని తోటి విద్యార్ధులతో లేదా స్నేహితులతో చెప్పుకోవడం వలన వారికి మానసికంగా ఆ సమస్య చాలా చిన్నదిగా కనపడుతుంది..అంతేకాదు నేను ఒంటరి వాడిని కాదు అనే భావన వారిలో కలుగుతుంది.

 

 విద్యా సంస్థలలో..విద్యార్ధులకి తప్పకుండ..సామాజిక కార్యకర్తలు..కౌన్సెలర్లతో ఒక సహాయక బృందం ఉంటే విద్యార్థులు సులభంగా వారి సహాయాన్ని పొందుతారు. అలాంటి సదుపాయం ఉంటే విద్యార్థికి ఆ విద్యాసంస్థ పట్ల వ్యతిరేకత తగ్గుతుంది. విద్యార్థులు తమ సమస్యలను ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా తల్లిదండ్రులతో పంచుకోగలిగే అవకాశం ఉంటుంది.  

 

విద్యార్ధులకి ప్రత్యామ్నాయ పరిష్కారాలు ఇవ్వగలగాలి..ఒకే విషయంలో విద్యార్ధిని సన్నధం చేసేటప్పుడు..అది కాకపొతే వేరే అవకాశం ఉంటుంది అనేట్టుగా వారిని ప్రేపైర్ చేయగలగాలి లేకపోతే విద్యార్ధి తన లక్ష్యం విఫలం అయినప్పుడు వేరే ఆలోచన లేకపోవడంతో నిరాశకు లోనయ్యి ఆత్మహత్యలకి పాల్పడే అవకాశం ఉంటుంది.

 

 విద్యార్థులు తమకున్న శక్తిసామర్థ్యాలపై నమ్మకముంచుకోవాలి. వారికున్న శక్తియుక్తులను ఉపయోగించుకుంటే వారు సుదూర లక్ష్యాలను చేరుకోగలరు..విద్యార్థులు తరచుగా తమలోని లోపాల గురించి మాత్రమే ఆలోచిస్తుంటారు. అలా కాకుండా వ్యక్తిత్వం, సామర్థ్యం, తెలివి వంటి వాటి విషయంలో కూడా మనసు కేంద్రీకరిస్తే ఎటువంటి సమస్య వచ్చినా సరే ఎదుర్కోగల మానసిక స్థితిని పొందగలరు.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: