జేఎన్ టీయూ హైదరాబాద్ కు కొత్త వీసీ వచ్చేశారు?
కిషన్ కుమార్ రెడ్డి గతంలో జేఎన్ టీయూహెచ్ రెక్టార్ గా, పండిట్ దీన్ దయాల్ పెట్రోలియం వర్శిటీ కి వీసీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఉస్మానియా వర్శిటీ ఇంజినీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన కిషన్ కుమార్ రెడ్డి... అనంతరం ఐఐటీ మద్రాస్ లో హీట్ ట్రాన్స్ ఫర్ అండ్ థర్మల్ పవర్ ఇంజినీరింగ్ లో ఎంటెక్ పూర్తి చేశారు.
యూఎస్ ఏలోని సదరన్ ఇల్లినాయిస్ యూనివర్శిటీలో ఫ్యూయల్ సైన్స్ లో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ చేసిన కిషన్ కుమార్ రెడ్డి... డ్రెక్సెల్ వర్శిటీ థర్మల్ ఫ్లూయిడ్ సైన్స్ లో ఎంఎస్, పీహెచ్ డీ పట్టాలను అందుకున్నారు. జేఎన్ టీయూ హెచ్ కి 21 ఏళ్ల పాటు అకడమిక్, అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో సేవలు అందించిన కిషన్ కుమార్ రెడ్డి... ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ విభాగానికి ఛైర్మెన్ గా ను పనిచేశారు.
ఆ తర్వాత కిషన్ కుమార్ రెడ్డి పండిట్ దీన్ దయాల్ పెట్రోలియం వర్శిటీ, గాంధీ ఇనిస్టిట్యూట్ ఆప్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విర్శిటీ లకు వీసీగా సేవలు అందించారు. ఏఐసీటీఈ రిసర్చ్ అండ్ ఇనిస్టిట్యూషనల్ డెవెల్మెంట్ అడ్వైజర్ గాను పనిచేసిన కిషన్ కుమార్ రెడ్డి.. టెక్నికల్ వర్శిటీల్లో పరిశోధనల కోసం దాదాపు 500 మిలియన్ రూపాయల ఫండ్ లను సమకూర్చటంలో కీలక పాత్ర పోషించారు.
తన సేవలకు గుర్తింపుగా పలు అవార్డులను సైతం అందుకున్న ప్రొఫెసర్ కిషన్ కుమార్ రెడ్డి... మూడేళ్ల కాలం పాటు జేఎన్ టీయూహెచ్ కి వీసీగా సేవలు అందించనున్నారు.