TG : రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వచ్చే ఏడాది నుంచి 'ఇంటర్' ఉండదా..?

murali krishna
విద్య వ్యవస్థలో కీలక మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. 2025 నుంచి ఇంటర్ బోర్డ్ పూర్తిగా ఎత్తివేసేందుకు ప్రణాళిక మొదలుపెట్టింది.దీని స్థానంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020  అమలు చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణలోనూ ఇంటర్ బోర్డ్ రద్దు చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. రాష్ట్రంలో స్కూల్, ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ వేర్వేరుగా కొనసాగుతుండగా.. కొత్త విధానం అమల్లోకి వస్తే 'బోర్డ్ఆఫ్ ఇంటర్మీడియెట్' రద్దై ‘స్కూల్ ఎడ్యుకేషన్’ అమల్లోకి రానుంది.తె లంగాణలో ఇంటర్ విద్యా విధానం ఎత్తివేయనున్నారా..? ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోబోతుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది.దేశవ్యాప్తంగా ప్రస్తుతం అమలు అవుతోన్న విద్యా విధానం స్థానంలో మార్పులు, చేర్పులతో కేంద్రం 2020లో కొత్త విద్యా విధానం తీసుకొచ్చింది.మెజార్టీ రాష్ట్రాలు కొత్త విద్యా విధానం అమలు చేస్తుండగా… తెలంగాణ సహా ఏడు రాష్ట్రాలు మాత్రమే అమలు చేయడం లేదు. ఈ క్రమంలోనే కొత్త విద్యా విధానం ఎందుకు అమలు చేయడం లేదని అభ్యంతరాలు తెలపాలని కేంద్రం… అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ను కోరినప్పటికీ, ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం కొత్త విద్యా విధానం అమలుపై చర్చిస్తున్నట్లు తెలుస్తోందిప్రస్తుతం రాష్ట్రంలో అమలు అవుతోన్న 5+2+3+2 విద్యా విధానం అమల్లో ఉంది. దీన్ని 5+3+3+4 (5 వరకు ప్రీ ప్రైమరీ, 8వరకు అప్పర్ ప్రైమరీ, 9 నుంచి సెకండరీ విద్యా విధానం అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. మొదటి ఐదేళ్లు అంగన్ వాడీ, ప్రీ స్కూల్ మూడేళ్లు 1,2 తరగతులు ఉంటాయి. తర్వాతి మూడేళ్లు 3,4, 5 తరగతులు, అనంతరం మూడేళ్లు 6,7,8 క్లాసులు ఉంటాయి. చివరి నాలుగేళ్లు 9,10,11,12 తరగతులు ఉంటాయి.ప్రస్తుతం తెలంగాణలో స్కూల్, ఇంటర్ విద్యా విధానం వేర్వేరుగా కొనసాగుతున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన కొత్త విధానం అమలు చేస్తే ఇంటర్ ప్రత్యేకంగా ఉండడు. పైగా..సర్కార్ పై అదనపు భారం తగ్గడంతోపాటు డ్రాపౌట్స్ తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తుండటంతో.. త్వరలోనే కొత్త విద్యా విధానం అమల్లోకి రానున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: