ఒక బిడ్డపై సగటు భారతీయ పేరెంట్స్ ఖర్చు ఎంతో తెలుసా..?

Pulgam Srinivas
కొన్ని సంవత్సరాల క్రితం ఇంట్లో అనేక మంది పిల్లలు ఉండేవారు. అలా ఉన్న వారిని పెంచడానికి పెద్ద మొత్తంలో ఖర్చు కాకపోవడంతో పిల్లలను ఎవరు భారంగా అనుకునేవారు కాదు. కానీ పరిస్థితులు మారాయి. పిల్లలు పుట్టారు అంటే పుట్టిన రోజు నుండే వారికి ఎంతో ఖర్చు చేయాల్సిన అవసరం తల్లి దండ్రులకు ఏర్పడింది. పుట్టిన వారు స్కూలుకు వెళ్లే వరకు వారికి ఒక రకం ఖర్చులు అయితే , స్కూలుకు వెళ్లడం మొదలు అయ్యింది అంటే వారి ఖర్చులు మరింత పెరుగుతాయి. ఇక వారు స్కూల్ నుండి కాలేజీ కి వెళ్లగానే ఖర్చులు మరింత పెరుగుతాయి.

ఇలా పిల్లలు పెరిగినా కొద్ది వారితో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. దానితో ప్రస్తుతం ఖర్చులు భారీగా పెరగడంతో ఎక్కువ మంది పిల్లలని కనడంలో ఈతరం దంపతులు భయపడుతున్నారు. అలాగే ఎంతో ఆలోచిస్తున్నారు. దానితో భారీగా పెరుగుతుంది అని అనుకున్న ఇండియా జనాభా కూడా తగ్గుముఖం పట్టింది. మరి మన ఇండియా లో సగటున ఒక పిల్లవాడు పెరిగి పెద్దగా అయ్యే వరకు ఎంత ఖర్చు కానుంది అనే దానిపై తాజాగా ఎడ్యు ఫండ్ అనే సంస్థ సర్వేను నిర్వహించింది. దాని ప్రకారం మన దేశంలో పిల్లలను కని , పెంచి డిగ్రీ వరకు చదివించేందుకు పేరెంట్స్ కి ఒక్కో బిడ్డపై సగటున 75 లక్షల రూపాయల వరకు ఖర్చు కానున్నట్లు ఈ సంస్థ వెల్లడించింది.

ఇక ఇంజనీరింగ్ కో బదులు మెడిసిన్ చదివినట్లు అయితే ఆ ఖర్చు 95 లక్షలు కానున్నట్లు , ఒక వేళ ఆ పిల్లవాడిని విదేశాలకు కనుక పంపినట్లు అయితే ఆ ఖర్చు 1.5 కోట్లకు పెరగనున్నట్లు ఈ సంస్థ నివేదిక లో వెల్లడించింది. అలాగే ఈ ఖర్చులకు భయపడి కొత్త జంటలు పిల్లలను కనడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అని కూడా ఈ సర్వే తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: