ఇంటర్ అయ్యాక ఈ కోర్సులు చేస్తే లక్షలు సంపాదించొచ్చు?

Purushottham Vinay
ఇంటర్మీడియట్  చదివిన తర్వాత విద్యార్థులు అందరూ కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా చదువుకోవాలి. ఏ కోర్స్ పడితే ఆ కోర్స్ అస్సలు చెయ్యకూడదు. ఇంటర్ అయ్యాక అది అత్యంత కష్టతరమైన సమయం. ఎందుకంటే ఆ సమయంలో ఏ రంగంలోకి వెళ్లాలో తేలిక కన్ఫ్యూజ్ అయ్యి ఏది పడితే అది చేస్తుంటారు విద్యార్థులు.ఇంటర్మీడియట్ తర్వాత లక్షల రూపాయల జీతం లేదా మీ వ్యాపారం చేసి లక్షలు సంపాదించే కొన్ని కోర్సులు వున్నాయి. ఇక వాటి గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.ఇక ఈ మధ్య కాలంలో మన దేశంలో వివిధ భాషల అనువాదకుల డిమాండ్ అనేది నిరంతరం బాగా పెరుగుతోంది.కేవలం ప్రయివేటు కంపెనీల్లోనే కాలేదు వివిధ ప్రభుత్వ శాఖల్లో కూడా ఇలాంటి వారికి డిమాండ్ ఏర్పడింది. నిజానికి లాంగ్వేజ్ ట్రాన్స్‌లేటర్ డిప్లొమా 6 నెలల నుండి ఒక సంవత్సరం దాకా ఉంటుంది. ఇప్పుడు చైనీస్, స్పానిష్ ఇంకా అలాగే ఫ్రెంచ్ భాషలకు అనువాదకులకు అధిక డిమాండ్ ఉంది.కాబట్టి తక్కువ టైంలో బాగా సెటిల్ అవ్వాలనుకునేవారు ఈ కోర్స్ ఎంచుకోవచ్చు.అలాగే మీకు కొత్త వస్తువులు తయారు చేయాలని అనిపిస్తే, మీరు ఫ్యాషన్ డిజైనర్, ఇంటీరియర్ డిజైనర్ ఇంకా వెబ్ డిజైనింగ్ సహా గ్రాఫిక్స్ డిజైనింగ్‌లో కోర్సులని చేయవచ్చు. 


ఇక ఈ కోర్సులు చేసిన తర్వాత, మీరు ఫ్రీలాన్స్ వర్క్ కూడా చేయవచ్చు లేదా పెద్ద కంపెనీలో జాబ్ కూడా చేయ వచ్చు. ఉద్యోగం లేదా ఫ్రీలాన్స్ చేయడం వల్ల  సంపాదించిన డబ్బుతో మీరు మీ స్వంత వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు. అయితే అందుకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు, ఇంకా అంతేకాదు మీరు విదేశాలలో కూడా పనిచేయవచ్చు.మెడికల్ ఫీల్డ్ అనేది బాగా ఖరీదయినది, కానీ డాక్టర్ అయితే మాత్రం సంపాదన చాలా బాగుంటుంది. అయితే అంత డబ్బు పెట్టలేని వారు ఉంటే వారు నర్సింగ్ లేదా ఫిజియోథెరపీలో డిప్లొమాని చేయవచ్చు. అయితే అలా చేయడం వలన ప్రయోజనం ఏమిటంటే, అది చేసిన తర్వాత మీరు మీ స్వంతగా ఓ క్లినిక్‌ని తెరవవచ్చు, లేదా మీరు ఏదైనా ఆసుపత్రిలో ఫిజియోథెరపిస్ట్ గా కూడా ఉద్యోగం చేయవచ్చు. లేదంటే మీరు క్లినిక్ నడుపుకుంటూనే హాస్పిటల్ లో కూడా పని చేయచ్చు. ఈ కోర్సులు చేయడం వల్ల ఖచ్చితంగా చిన్న వయస్సులోనే మీరు జీవితంలో సెటిల్ అయిపోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: