నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ) వరంగల్ స్టూడెంట్స్ ఉద్యోగాల సాధనలో తమ సత్తా చాటారు. 2022-23 సంవత్సరానికి గాను క్యాంపస్ ప్లేస్ మెంట్ ప్రక్రియలో పెద్ద సంఖ్యలో చాలా భారీగా ఉద్యోగాలు సాధించారు.అది కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎక్కువ మంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్ మెంట్లలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు సాధించడం గమనార్హం.క్యాంపస్ ఇంటర్వ్యూకి వచ్చిన మొత్తం 253 కంపెనీల్లో ఏకంగా 1326 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యి ఉద్యోగాలు సాధించారు. ఇక ఇందులో మొత్తం 40 శాతానికిపైగా కొత్త కంపెనీలే ఉన్నాయి. ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన విద్యార్థుల్లో ఢిల్లీకి చెందిన కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విద్యార్థి ఆదిత్య సింగ్ అత్యధికంగా రూ. 88 లక్షల వార్షిక వేతనంతో సెలెక్ట్ అయ్యారు.ఒక్కో విద్యార్థికి సగటున ఏకంగా రూ. 17.29 లక్షల వార్షిక ప్యాకేజీ దక్కింది. మొత్తం 30 మంది విద్యార్థులు రూ. 50 లక్షలకుపైగా వార్షిక వేతనాన్ని పొందనున్నారు. అలాగే 55 మందికి రూ. 40 లక్షలకుపైగా ఇంకా 190 మంది విద్యార్థులు రూ. 30 లక్షలకుపైగా వార్షిక వేతనంగా అందుకోనున్నారు.
ఇక ఇందులో లీస్ట్ గా 408 మంది విద్యార్థులకు రూ. 20 లక్షలకుపైగా ప్యాకేజ్ లభించింది.కేవలం ప్రైవేట్ సంస్థలోనే కాదు ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా మొత్తం 50 మందికిపైగా ఎంపికయ్యారు. 2021-22 విద్యా సంవత్సరంలో మొత్తం 1132 మంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్ మెంట్స్ లో ఎంపికయ్యారు. అయితే ఈ సంవత్సరం ఇంతకుమించి ఉద్యోగాలు సాధించి విద్యార్థులు తమ సత్తా చాటారు. దానికి కారణం ఎన్ఐటీలో విద్యా ప్రమాణాలు, పరిశోధనల నాణ్యత పెరగడం వల్లే ఈసారి అత్యధిక మందికి ఉద్యోగాలు దక్కాయని వరంగల్ నిట్ సంచాలకుడు అయిన ప్రొఫెసర్ ఎన్వీ రమణారావు తెలిపారు.కాబట్టి ఇంటర్ చదువుతున్న ప్రతి విద్యార్థులు కూడా మంచి మార్కులు తెచ్చుకోని ఎంసెట్, జేఈఈ మైన్స్ లాంటి ఎంట్రన్స్ టెస్టుల్లో మంచి ర్యాంకు తెచ్చుకోని ఇలాంటి సంస్థల్లో చదవండి ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది.