జగనన్న గోరుముద్ద: విద్యార్థులకు మరో పౌష్టికాహారం?

Purushottham Vinay
బడికి వెళ్లే చిన్నారులకు ఎన్నో రకాల సౌకర్యాలు కల్పిస్తుంది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. ఇంకా అంతేగాక వారికి ఆహారం విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది.పిల్లలకు ఖచ్చితంగా పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం జగనన్న గోరు ముద్దు పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ పథకంలో భాగంగా ప్రతి రోజూ కూడా మెనూ మార్చి బలవర్ధకమైన, మెరుగైన, రుచికరమైన ఇంకా అలాగే నాణ్యమైన పౌష్టికాహారంని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందిస్తోంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ మెనులో మరో పోషకాహారంని కూడా అందించనున్నారు.44,392 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లోని మొత్తం 37,63,698 మంది విద్యార్ధులకు రాగిజావ అందించే కార్యక్రమాన్ని మంగళవారం నాడు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. మొత్తం రూ. 86 కోట్ల అదనపు వ్యయంతో చేపడుతోన్న ఈ కార్యక్రమాన్ని సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి ఉదయం పూట 11 గంటలకు ప్రారంభించనున్నారు.


ఈ మధ్యాహ్న భోజనం పథకంలో సమూల మార్పులు చేసిన ఏపీ ప్రభుత్వం జగనన్న గోరుముద్ద పేరుతో చిన్నారులకు చక్కటి పౌష్టికాహారం అందిస్తోంది.ఇక అలాగే తాజాగా జోడించిన రాగిజావాను వారానికి మూడు రోజులు ప్రభుత్వం వారు అందించనున్నారు. ఇంకా మిగిలిన మూడు రోజుల్లో చిక్కీ ఇవ్వనున్నారు. జగనన్న గోరుముద్దలో భాగంగా వారానికి 15 రకాలు, ఐదు రోజుల పాటు- గుడ్డు, 3 రోజులు చిక్కీ అలాగే ఇకపై 3 రోజులు రాగిజావ కూడా ఇవ్వనున్నారు. ఇక జగనన్న గోరు ముద్ద పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏడాదికి మొత్తం రూ.1824 కోట్లు ఖర్చు చేస్తుంది.ఈ రాగి జావ కూడా జగనన్న గోరుముద్ద పథకంలో చేరడంతో మరో రూ. 86 కోట్లతో కలిపి మొత్తం జగనన్న గోరుముద్ద పథకం ఏకంగా రూ.1910 కోట్లకు చేరుకుంది.ఇలా చదువుకునే పిల్లల కోసం జగన్ మోహన్ రెడ్డి అనేక రకాల పథకాలని ప్రవేశపెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: