ఆంధ్రప్రదేశ్: విద్యార్థులకు చక్కటి శుభవార్త?

Purushottham Vinay
ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  సంక్షేమంపై మరింత ఫోకస్ చేస్తున్నారు.ఎలక్షన్స్ కి సమయం దగ్గర పడుతుండడంతో.. ఉన్న పథకాలకు సమయానికి తగిన డబ్బులు అందిస్తున్నారు. ఇంకా అలాగే కొత్త పథకాల రూపకల్పన చేస్తున్నారు. పాత పథకాలకు చెప్పిన షెడ్యూల్ ప్రకారం విడతల వారీగా నగదుని కూడా జమ చేస్తున్నారు. ఇక ఇందులో భాగంగా విద్యా దీవెన నగదు విడుదల చేయడానికి ఇప్పుడు రెడీ అయ్యారు.ఆంధ్రప్రదేశ్ విద్యార్థులంతా ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న జగనన్న విద్యాదీవెన నగదు విడుదల ముహూర్తి ఫిక్స్ చేసింది ప్రభుత్వం. విద్యా దీవెన లబ్ధిదారుల ఖాతాల్లోకి ఫీజు రియింబర్స్‌మెంట్‌ పథకం డబ్బులని జమ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.తాజాగా రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు ఇంకా అలాగే చేపట్టనున్న కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి సోమవారం నాడు సీఎంఓ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలని కూడా తీసుకున్నారు.


అసెంబ్లీ సమావేశాలు, మార్చి, ఏప్రిల్‌ నెలలో చేపట్టాల్సిన కార్యక్రమాలు ఇంకా అలాగే అమలుచేయాల్సిన పథకాలను ఫిక్స్ చేశారు. ఇందులో భాగంగానే విద్యా దీవెన పథకంపైనా కూడా క్లారిటీని ఇచ్చారు.ఇక ఉన్నత విద్యను అభ్యశిస్తున్న వారికి పూర్తి ఫీజు రియింబర్స్ మెంట్ పథకాన్ని కూడా ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా జగనన్న విద్యాదీవెన పథకం కింద దాదాపు 10.85 లక్షల మంది విద్యార్ధులకు ఏకంగా రూ. 709 కోట్లను సీఎం వైఎస్‌ జగన్‌ బటన్ నొక్కి విడుదల చేయనున్నారు.ఇక గత ప్రభుత్వం పెట్టిన ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ బకాయిలు మొత్తం 1,778 కోట్ల రూపాయలతో సహా ఇప్పటి దాకా జగనన్న విద్యా దీవెన ఇంకా జగనన్న వసతి దీవెన పథకాల క్రింద ప్రభుత్వం సాయం అందించింది. ఇతర సంక్షేమ పథకాలతో జగనన్న విద్యా దీవెన ఇంకా జగనన్న వసతి దీవెన పథకాలకు లిమిట్స్‌ లేవని జగన్ స్పష్టం చేశారు. మన కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈ పథకం కింద లబ్ధిచేకూరనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: