రైల్వే: టెన్త్ అర్హతతో భారీగా ఉద్యోగాలు!

Purushottham Vinay
రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగాలు ఆశించే అభ్యర్థులకు చక్కటి శుభవార్త.రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ ఇంకా అలాగే నార్త్ సెంట్రల్ రైల్వే అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వీటి కింద మొత్తం 1659 అప్రెంటీస్‌ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు.కాబట్టి ఆసక్తి ఇంకా అలాగే అర్హత గల అభ్యర్థులు ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేయడానికి అధికారిక వెబ్‌సైట్ rrcpryj.orgని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో వీటిని దరఖాస్తు చేసుకోవచ్చు.ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 1 ఆగస్టు 2022. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ  అనేది 02 జూలై 2022 నుంచి కూడా ప్రారంభం అయింది.ఇక మొత్తం ఖాళీల సంఖ్య  వచ్చేసి 1659 ఉండగా.. ఇందులో ప్రయాగ్‌రాజ్ లో 703, ఝాన్సీలో 660 ఇంకా అలాగే ఆగ్రాలో 296 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థి 10+2 నమూనాలో గుర్తింపు పొందిన సంస్థ నుండి 10వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఖచ్చితంగా ఉత్తీర్ణులై ఉండాలి.ఇంకా అలాగే.. అతను/ఆమె NCVT లేదా SCVT ఇంకా భారత ప్రభుత్వం నుండి సంబంధిత ట్రేడ్‌లో ITI డిప్లొమాని కలిగి ఉండాలి.


ఇక ఈ పోస్టులకు ఎంపిక ఎలా జరుగుతుందంటే.. మెరిట్ ఆధారంగా ఎంపిక అనేది ఉంటుంది.మెట్రిక్యులేషన్ ఇంకా అలాగే ఐటీఐ రెండింటి మార్కులకు సమాన వెయిటేజీ ఇవ్వబడుతుంది. ఇక దాని ఆధారంగా మెరిట్ జాబితాను తయారు చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు ఫీజు రూ.100. రిజర్వేషన్ కేటగిరీ ఇంకా మహిళా అభ్యర్థులు అలాగే పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.ఇక ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చిన లింక్ ను మీరు కాపీ చేసి.. తరువాత గూగుల్ లో సెర్చ్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఆ లింక్ ఇదే..https://www.rrcpryjonline.com/index_act_apprentice_2022_1339.php.ఇంకా అలాగే ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు.. దరఖాస్తు విధానం ఇంకా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అలాగే ఇతర వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://rrcpryj.org/ ను సందర్శించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: