గుడ్ న్యూస్ : డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు!

Purushottham Vinay

మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ (MANUU) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ట్రైనర్(Trainer) ఇంకా ఫెసిలిటేటర్(Facilitator) ఖాళీల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.ఆసక్తి ఇంకా అలాగే అర్హత గల అభ్యర్థులు చివరి తేదీకి ముందు ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. MANUU పూర్నియా, కతిహార్ లొకేషన్‌లో ట్రైనర్ ఇంకా ఫెసిలిటేటర్ ఖాళీల కోసం అభ్యర్థులను రిక్రూట్ చేస్తోంది. ఇక వీటిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకోనున్నారు. ఇక్కడ అర్హత ప్రమాణాలు, ఖాళీల సంఖ్య ఇంకా అలాగే ఎంపిక ప్రక్రియ అలాగే ఇతర వివరాలను తెలుసుకుందాం..

ఇక పోస్టుల వివరాల విషయానికి వస్తే..
ట్రైనర్ అండ్ ఫెసిలిటేటర్ పోస్టులు.
ఖాళీల వివరాలు:
* ట్రైనర్ పోస్టులు మొత్తం - 36
*ఫెసిలిటేటర్ పోస్టులు మొత్తం -12.
*మొత్తం ఖాళీల సంఖ్య 48.
*వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు వచ్చేసి జూన్ 30 నాటికి 30 ఏళ్లకు మించకూడదు.

*జీతం: నెలకు రూ. 12 వేల నుంచి రూ. 15 వేల వరకు చెల్లిస్తారు.

*అర్హతలు: ఇంకా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి. ఉర్దూపై ఖచ్చితంగా నాలెడ్జ్ ఉండాలి.ఇంకా వీటితో పాటు.. బీఈడీ లేదా ఎఈడీ లేదా ఎంఎస్ డబ్ల్యూలో ఉత్తీర్ణత సాధించాలి. ఇంకా అలాగే మదర్సా రిసోర్స్ సెంటర్ కు సంబంధించి అవగాహన ఉన్నవాళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది.

*ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

*దరఖాస్తు విధానం: వీటికి ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అలాగే అభ్యర్థి బయోడేటాను తగిన అర్హతలతో manuuaep@gmail.com మెయిల్ ఐడీకి పంపిస్తే సరిపోతుంది.

దరఖాస్తును మీరు ఇలా సమర్పించండి..
Step 1: MANUU అధికారిక వెబ్‌సైట్ అయిన manuu.ac.inని సందర్శించండి
Step 2: ఇక వెబ్‌సైట్‌లో.. నోటిఫికేషన్ పై క్లిక్ ఇవ్వగానే మరో విండ్ అనేది ఓపెన్ అవుతుంది. దానిలో ఎడమ వైపు ఉన్న ఎంప్లాయి మెంట్ నోటీస్ కు మీరు వెళ్లాలి.
Step 3:ఇక దానికిపై క్లిక్ చేయగానే 29 జూన్ 2022న విడదలైన నోటిఫికేషన్ వివరాలు మీకు కనిపిస్తాయి. ఇక వాటిపై క్లిక్ చేసి.. నోటిఫికేషన్ ను మీరు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
Step 4: నోటిఫికేషన్ అంతా కూడా మూడు భాషల్లో ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ కనిపిస్తుంది. అందులో మీకు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ నోటిఫికేషన్ ను మీరు ఎంచుకొని.. పూర్తి వివరాలను చదువుకోవాలి. ఇక అందులో ఏ మోడ్ లో దరఖాస్తు సమర్పించాలో ఉంటుంది. దాని ప్రకారం మీరు దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది.ఇక
దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ వచ్చేసి 20 జూలై 2022 గా పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: